Home » హైదరాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎంపిక పై రాజాసింగ్ కామెంట్స్ వైరల్..!

హైదరాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎంపిక పై రాజాసింగ్ కామెంట్స్ వైరల్..!

by Anji
Ad

హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ 2004 నుంచి ప్రస్తుతం వరకు కొనసాగుతున్నారు. అంతకు ముందు అతని తండ్రి సుల్తాన్ సలా ఉద్దీన్ ఓవైసీ 1984 నుంచి 2004 వరకు ఆరు సార్లు ఎంపీగా విజయం సాధించారు.ఈసారి ఎలాగైనా అసదుద్దీన్ కి చెక్ పెట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎదురులేని నేతగా ఓవైసీని గట్టి దెబ్బ కొట్టాలన్నది బీజేపీ ప్లాన్. ఈసారి ఎలాగైనా అసదుద్దీన్ ని ఓడించాలని నారీ శక్తిని రంగంలోకి దింపింది బీజేపీ.

Advertisement

అయితే హైదరాబాద్ లోక్ సభ అభ్యర్థి ఎంపికపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్  చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్  లోక్ సభ నుంచి రాజాసింగ్ పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ స్థానానికి మాధవీలత పేరును ప్రకటించడంపై ఆయన కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారా..? మొగోడే దొరకలేదా..?  అంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్  సృష్టిస్తున్నాయి.  తెలంగాణ నుంచి ప్రకటించిన 9 మంది అభ్యర్థుల్లో ఆయన పేరు లేకపోవడంపై రాజాసింగ్ కాస్త అసహానికి గురైనట్టు  వార్తలు వస్తున్నాయి.

Advertisement

 

హైదరాబాద్  లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా మాధవీలత పేరును బీజేపీ  అధిష్ఠానం  ప్రకటించిన విషయం విదితమే. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ ని  ఢిల్లీలో కలిసి   మాధవీలత పార్టీలో చేరారు. సోషల్ మీడియాలో రాజాసింగ్ చేసిన కామెంట్స్ చక్కర్లు కొడుతున్న వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.  మాది ఒక కుటుంబం. కుటుంబంలో అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల మధ్య మాటలు జరుగుతుంటాయి. అవన్నీ సర్దుకుంటాయి. తమ్ముడు అక్కను ఏమైనా అంటే తప్పు పట్టొచ్చా..? అని విలేకరులను ఆమె ఎదురు ప్రశ్నించారు మాధవీ లత. ప్రస్తుతం రాజాసింగ్ చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అవ్వడం విశేషం.

Also Read :  ఎంపీ, ఎమ్మెల్యే ల విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. పీవీ నరసింహారావు కేసుకి దీనికి సంబంధం ఏంటి..?

Visitors Are Also Reading