Home » ప‌వ‌న్ క‌ల్యాణ్, బాల‌కృష్ణ సినిమాల‌తో అదే రేంజ్ లో హిట్ కొట్టిన రాజ‌శేఖ‌ర్ సినిమా ఏదో తెలుసా..?

ప‌వ‌న్ క‌ల్యాణ్, బాల‌కృష్ణ సినిమాల‌తో అదే రేంజ్ లో హిట్ కొట్టిన రాజ‌శేఖ‌ర్ సినిమా ఏదో తెలుసా..?

by AJAY
Ad

యాంగ్రీయంగ్ మ్యాన్ రాజ‌శేఖ‌ర్ అంటే ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌తో రాజ‌శేఖ‌ర్ టాలీవుడ్ లో ఒక‌ప్పుడు స్టార్ గా రాణించాడు. మాస్..క్లాస్..సెంటిమెంట్ ఇలా అన్ని ర‌కాల పాత్ర‌ల‌లో న‌టించి అద‌ర‌గొట్టాడు. అంతే కాకుండా ఆ రోజుల్లో రాజ‌శేఖర్ స్టార్ హీరోల‌కు పోటీ ఇచ్చేవాడు. కేవ‌లం ఒకే ర‌క‌మైన పాత్ర‌లు కాకుండా విభిన్న క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇక రాజేశేఖ‌ర్ కెరీర్ లో చేసిన సూప‌ర్ హిట్ సినిమాల‌లో సింహ‌రాశి కూడా ఒక‌టి.

Advertisement

Advertisement

ఈ సినిమా 2001లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపించాడు. ఈ సినిమా చూసిన త‌ర‌వాత చాలా మంది రాజ‌శేఖ‌ర్ న‌ట‌న‌కు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో సాక్షి శివానంద్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా అదే ఏడాది విడుద‌లైన బాల‌కృష్ణ న‌ర‌సింహ‌నాయుడు తో పాటూ అదే ఏడాది విడుద‌లైన ప‌వ‌న్ క‌ల్యాణ్ కుషి సినిమా త‌ర‌వాత అదే రేంజ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచింది.

అది కూడా త‌క్కువ గ్యాప్ లో ఆ రేంజ్ లో హిట్ కొట్ట‌డం విశ్లేష‌కులు గ్రేట్ అని చెప్పుకున్నారు. కేవ‌లం 5 కోట్ల‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌గా 15కోట్ల షేర్ ను రాబ‌ట్టింది. ఆ రోజుల్లో అంత‌టి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం కూడా చెప్పుకోద్ద‌గ్గ విష‌య‌మే. ఇక రాజ‌శేఖ‌ర్ చివ‌ర‌గా గ‌రుడువేగ సినిమాతో హిట్ అందుకున్నాడు. కాగా ఆయ‌న న‌ట‌వారసులుగా ఇద్దరు కూతుళ్లు కూడా హీరోయిన్లు గా ఎంట్రీ ఇచ్చారు.

Visitors Are Also Reading