ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అద్భుతమైన సంగీతం అందించినందుకు కీరవాణికి ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ శ్రీ అవార్డు వరించింది. ఎన్నో సినిమాలకు కీరవాణి స్వరాలను సమకూర్చారు. తన వినసొంపు అయిన బాణీలతో నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకులకు ఉర్రూతలూగిస్తున్నారు. తన కెరీర్ లోనే ఎన్నో వేల పాటలను కంపోజ్ చేసారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో సంగీత దర్శకుడు కీరవాణి పేరు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చింది.
Advertisement
ప్రధానంగా కీరవాణి కంపోజ్ చేసినటువంటి నాటు నాటు సాంగ్ ఇప్పటికే ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచిన విషయం విధితమే. మరోవైపు నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పద్మ శ్రీ పురస్కారం కూడా రావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో కీరవాణికి పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా కీరవాణికి పద్మ శ్రీ రావడంపై దర్శక ధీరుడు రాజమౌళి స్పందించారు. వాస్తవానికి ఈ గుర్తింపు ఎప్పుడో వచ్చి ఉండాల్సింది. ఇది చాలా ఆలస్యం అయింది.
Advertisement
Also Read : “డాడీ” సినిమా లో చిరంజీవి కూతురు గుర్తుందా ..? ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూశారా ..?
కానీ మీరు ఎప్పుడూ చెబుతారు కదా.. మన కష్టానికి తగిన ప్రతిఫలం ఊహించని విధంగా అందుతుందని.. ఒకవేళ నేనే కనుక ఈ విశ్వంతో మాట్లాడగలిగితే.. కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా. ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేసిన తరువాత మరొకటి ఇవ్వమని చెబుతాను అంటూ రాజమౌళి భావోద్వేగ పోస్ట్ చేశారు. దీనికి ఎం.ఎం. కీరవాణి వయోలిన్ వీణ వాయిస్తుండగా.. తాను కింద కూర్చున్నటువంటి పోటోలను షేర్ చేస్తూ.. నా పెద్దన్న పద్మ శ్రీ అవార్డు, గ్రహీత, గర్వంగా ఉంది అంటూ రాసుకొచ్చారు.
Also Read : తన కొడుకు కంటే ఎక్కువ బాలయ్యని ఆదరించిన ఏఎన్ఆర్.. కానీ బాలయ్య మాత్రం..?