Home » తన కొడుకు కంటే ఎక్కువ బాలయ్యని ఆదరించిన ఏఎన్ఆర్.. కానీ బాలయ్య మాత్రం..?

తన కొడుకు కంటే ఎక్కువ బాలయ్యని ఆదరించిన ఏఎన్ఆర్.. కానీ బాలయ్య మాత్రం..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీని అవమానించిన విషయమే కనిపిస్తోంది. వీర సింహారెడ్డి చిత్రం సక్సెస్ మీట్ లో బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ వారి ఫ్యామిలీ ని కించపరుస్తూ మాట్లాడారు. దీంతో అక్కినేని అభిమానులంతా విరుచుకుపడుతూ బాలకృష్ణ ప్లెక్సీలను కాలుస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే మరో వార్త బయటకు వచ్చింది..

Advertisement

also read:ఆస్కార్ నామినేషన్లకు జక్కన్న పెట్టిన ఖర్చు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Advertisement

అక్కినేని నాగేశ్వరరావు తన సొంత కొడుకు అయిన నాగార్జున కంటే బాలకృష్ణని బాగా చూసుకునే వారట. బాలకృష్ణతో చాలా సరదాగా మాట్లాడేవారని, చాలా విషయాలు షేర్ చేసుకునేవారని అంటున్నారు. ఏఎన్ఆర్ బాలకృష్ణకు మధ్య మంచి అనుబంధం ఉండేదని, ఈ విషయం నాగార్జున కూడా తెలుసని అంటున్నారు. ఈ విధంగా ఏఎన్ఆర్ తన కన్న కొడుకు కంటే ఎక్కువగా బాలకృష్ణని చూసుకున్నారు. తండ్రి లాంటి ఏఎన్ఆర్ ను ఈ విధంగా బాలకృష్ణ విమర్శించడం అక్కినేని అభిమానులకు కోపం తెప్పిస్తోంది.

దీంతో బాలకృష్ణ కచ్చితంగా క్షమాపణలు చెప్పాలంటూ చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా కానీ బాలకృష్ణ మాత్రం సైలెంట్ గా తనకేమీ తెలియనట్టుగా ఉన్నారు. మరి ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారకముందే బాలయ్య స్పందిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

also read:

Visitors Are Also Reading