Home » Rajamouli : మరోసారి తండ్రి కాబోతున్న జక్కన్న.. ?

Rajamouli : మరోసారి తండ్రి కాబోతున్న జక్కన్న.. ?

by Bunty
Published: Last Updated on
Ad

టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేని ఏకైక దర్శకుడిగా ఎస్ ఎస్ రాజమౌళి రికార్డు సృష్టించాడు. అప్పుడెప్పుడో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా మారిపోయిన రాజమౌళి… ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తోనే సింహాద్రి సినిమా కూడా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

Advertisement

ఇక అప్పటినుంచి సినిమాలలో తనకు ఎవరూ సాటి లేరు అనే విధంగా దూసుకుపోతున్నాడు ఎస్ఎస్ రాజమౌళి. ఇక ఇటీవల ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయికి ఎదిగాడు రాజమౌళి. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో దర్శక ధీరుడు రాజమౌళికి క్రేజ్ పెరిగింది. ఇది ఇలా ఉండగా తాజాగా రాజమౌళి గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రాజమౌళి త్వరలోనే తండ్రి కాబోతున్నాడట.

Advertisement

రాజమౌళి మరియు రమ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రమాకు మొదట ఓ మ్యూజిక్ డైరెక్టర్ తో పెళ్లి అయి విడాకులు కూడా అయింది. రమాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్కు కార్తికేయ పుట్టాడు. అయితే విడాకులు తీసుకున్న రమాను రాజమౌళి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి తండ్రి కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. గతంలో మయూక అనే అమ్మాయిని దత్తత తీసుకున్న రాజమౌళి… ఇప్పుడు మరో అమ్మాయిని దత్తత తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఆ విధంగా మరోసారి రాజమౌళి తండ్రి కాబోతున్నాడన్నమాట.

ఇవి కూడా చదవండి

విజయ్‌ దేవరకొండ కీలక ప్రకటన.. ఫ్యాన్స్‌కు రూ.కోటి ఇస్తానంటూ ప్రకటన..

Icc world cup 2023 : వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. తిలక్, చాహాల్ ఔట్!

Chiranjeevi: మరోసారి కలిసి నటించనున్న మెగాస్టార్- రామ్ చరణ్..!

Visitors Are Also Reading