Home » చిరంజీవి పై ఫైర్ అయ్యిన రాజ‌మౌళి…అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారిన వార్త‌..!

చిరంజీవి పై ఫైర్ అయ్యిన రాజ‌మౌళి…అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారిన వార్త‌..!

by AJAY
Ad

రాజ‌మౌళి ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ పేరు వినిపిస్తోంది. శాంతినివాసం సీరియ‌ల్ తో రాజ‌మౌళి త‌న కెరీర్ ను ప్రారంభించాడు. సీరియ‌ల్ ద‌ర్శ‌కుడిగా కెరీర్ మొద‌లు పెట్టి సినిమా ద‌ర్శ‌కుడుగా మారాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన స్టూడెంట్ నంబ‌ర్ 1 సినిమాతో ద‌ర్శ‌కుడుగా మొద‌టి హిట్ అందుకున్నాడు. ఆ త‌ర‌వాత ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌ను చేశాడు.

Advertisement

ఇక మ‌గ‌ధీర‌, బాహుబ‌లి, ఈగ, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు జ‌క్క‌న్న‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టాయి. రాజ‌మౌళి త‌న త‌దుప‌రి సినిమాను మ‌హేశ్ బాబు తో తెర‌కెక్కించను్న్నారు. ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి, ఇదిలా ఉంటే రాజ‌మౌళి గురించి ప్ర‌స్తుతం ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Advertisement

రాజ‌మౌళి చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ హీరోగా మ‌గ‌ధీర సినిమాను తెరకెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో జ‌క్క‌న్న ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను బీట్ చేసి స‌రికొత్త రికార్డును క్రియేట్ చేశారు. అయితే ఈ సినిమా త‌ర‌వాత మెగాఫ్యాన్స్ స‌పోర్ట్ తోనే ఇంత‌పెద్ద హిట్ అయ్యిందని హీరో వల్ల‌నే సినిమా ఈ రేంజ్ లో హిట్ అయ్యింద‌ని ప్ర‌చారం జిగిరింది. దాంతో ఎంతో క‌ష్ట‌పడిన రాజ‌మౌళి చిరంజీవి పై ఫైర్ అయ్యిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యం త‌న‌కు తెలియ‌కుండా జరిగింద‌ని చిరంజీవి జ‌క్క‌న్న కు చెప్ప‌డంతో ఆయ‌న కూల్ అయిన‌ట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading