Home » అల్లు అర్జున్ తో జ‌క్క‌న్న పాన్ ఇండియా మూవీ..ఫ్యాన్స్ కు పూన‌కాలే!

అల్లు అర్జున్ తో జ‌క్క‌న్న పాన్ ఇండియా మూవీ..ఫ్యాన్స్ కు పూన‌కాలే!

by AJAY
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప సినిమా విజ‌యంతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 కోసం సిద్దం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వ‌ర‌లోనే షురూ కానుంది. ఇదిలా ఉండ‌గా అల్లు అర్జున్ త‌ర‌వాత సినిమా పై క్రేజీ అప్డేట్ వార్త‌ల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అల్లు అర్జున్ రాజ‌మౌళి కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోంతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

ALLU ARJUN

ALLU ARJUN

అంతే కాకుండా ఈ సినిమా 2023లో ప‌ట్టాలెక్కే అవ‌కాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై అఫీయ‌ల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుంద‌ని టాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా రాజ‌మౌళి మహేశ్ బాబు తో కూడా ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ప్రాజెక్ట్ క‌న్ఫామ్ అయితే ఎవ‌రితో ముందు సినిమా చేస్తార‌నే అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఇక ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.

Advertisement

Visitors Are Also Reading