Home » ఆర్ఆర్ఆర్ త‌ర‌వాత క‌న్న‌డ న‌టీన‌టుల‌తో సినిమా చేస్తా : రాజ‌మౌళి

ఆర్ఆర్ఆర్ త‌ర‌వాత క‌న్న‌డ న‌టీన‌టుల‌తో సినిమా చేస్తా : రాజ‌మౌళి

by AJAY

ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ లు సినిమా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో ఫుల్ బిజీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమా క‌న్న‌డ ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మాన్ని బెంగూళురులో డిసెంబ‌ర్ 10వ‌తేదీన నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్, చ‌ర‌ణ్ తో పాటూ ఆర్ఆర్ఆర్ లో చ‌ర‌ణ్ కు జోడీగా న‌టించిన అలియాభ‌ట్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల మ‌ర‌ణించిన క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ను గుర్తు చేసుకుని ఎన్టీఆర్ ఎమోష‌నల్ అయ్యారు. కన్న‌డ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో పునీత్ రాజ్ కుమార్ లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని అన్నారు.

Rajamouli

Rajamouli

పునీత్ లేక‌పోవ‌డం శూన్యంగా అనిపిస్తుంద‌ని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా పునీత్ రాజ్ కుమార్ హీరోగా న‌టించిన చక్ర‌వ్యూహ అనే సినిమాలో ఎన్టీఆర్ ఒక పాట‌ను పాడారు. ఆ పాట‌కు పాడి స్టేజ్ పై అల‌రించారు. ఎప్పుడు బెంగుళూరు వ‌చ్చినా పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లేవాడిన‌ని గుర్తు చేసుకున్నారు. అదే విధంగా క‌న్న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సినిమా చేయాల‌ని ఉందంటూ ఎన్టీఆర్ చెప్పారు. త‌న త‌ల్లి కూడా క‌ర్నాటకు చెందిన‌వారే అని వ్యాఖ్యానించారు. అంద‌రిర మ‌ధ్య‌లో క‌న్న‌డ‌లో మాట్లాడ‌టం ఎంతో ఆనందంగా ఉందంటూ ఎన్టీఆర్ ఎమోష‌నల్ అయ్యారు.

also read : హైద‌రాబాద్ లో రెండెకరాలు కొన్న పాన్ ఇండియా స్టార్…ధ‌ర ఎంతంటే..?

ఆర్ఆర్ఆర్ సినిమా క‌న్న‌డ‌లో రావ‌డం సంతోషంగా ఉందని…త‌న సొంత వాయిస్ ను వినిపిస్తాన‌ని…ఈ సినిమాకు తానే డ‌బ్బింగ్ చెప్పాన‌ని ఎన్టీఆర్ వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా రాజ‌మౌళి మాట్లాడుతూ…ఆర్ఆర్ఆర్ త‌ర‌వాత క‌న్న‌డ నటుల‌తో పూర్తిస్థాయి సినిమా చేయాల‌ని ఉంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్ కూడా క‌న్న‌డ న‌టుల‌తో న‌టించేంద‌కు వెయిట్ చేస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు.

Visitors Are Also Reading