Home » హైద‌రాబాద్ లో రెండెకరాలు కొన్న పాన్ ఇండియా స్టార్…ధ‌ర ఎంతంటే..?

హైద‌రాబాద్ లో రెండెకరాలు కొన్న పాన్ ఇండియా స్టార్…ధ‌ర ఎంతంటే..?

by AJAY
Ad

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఇండియాలోనే అతిపెద్ద స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిపోయారు. బాహుబలి సినిమా త‌ర‌వాత ప్ర‌భాస్ క్రేజ్ ఒక్క‌సారిగా ఇండియా వ్యాప్తంగా పెరిగిపోయింది. బాలీవుడ్ మేక‌ర్స్ సైతం ప్ర‌భాస్ డేట్ ల కోసం ఎదురు చూసే స్థాయికి ఎదిగిపోయాడు. తెలుగు హీరోల‌తో సినిమా చేయాలంటే భారీగా డిమాండ్ చేసే బాలీవుడ్ భామ‌లు ప్ర‌భాస్ తో సినిమా చేయాల‌ని ఉందంటూ మీడియా ముందే చెప్ప‌డం షురూ చేశారు. బాలీవుడ్ లోనూ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ఇక ఇప్ప‌టికే ప్ర‌భాస్ హీరోగా పాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్ షూటింగ్ పూర్త‌య్యింది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.

prabhas

prabhas

ఇది ఇలా ఉండ‌గా ప్రభాస్ కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తో స‌లార్ చిత్రం చేస్తున్నారు. కేజీఎఫ్ లాంటి రికార్డులు క్రియేట్ చేసిన సినిమా కావ‌డంతో స‌లార్ సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా కూడా బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గానే ప్ర‌భాస్ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిపాత్ర‌లో న‌టిస్తున్నారు. అంతే కాకుండా మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో కూడా ప్రభాస్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.

Advertisement

Advertisement

ఈ సినిమా పాన్ వ‌రల్డ్ చిత్రంగా తెర‌కెక్క‌బోతుంది. మ‌రోవైపు అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగాతో కూడా ఓ ప్ర‌భాస్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇక వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్ ప్రాప‌ర్టీలు కూడా ఎక్కువ‌గానే కొనుగోలు చేస్తున్నారు. రీసెంట్ గా ముంబైలో ప్ర‌భాస్ ఓ ల‌గ్జ‌రీ బంగ్లాను కొనుగోలు చేశాడు. కాగా తాజాగా హైద‌రాబాద్ లో ఏకంగా మూడెక‌రాల భూమిని కొనుగోలు చేశారు. ఎయిర్ పోర్ట్ ఔట‌ర్ రింగ్ రోడ్డుకు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో నాన‌క్ గూడలోని సినీవిలేజ్ లో రూ.120 కోట్లు పెట్టి ఈ లాండ్ ను కొనుగోలు చేశారు. రూ.80 కోట్లు పెట్టి ఇందులో విల్లాను నిర్మించే ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading