Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినీ ఇండస్ట్రీని ఈ స్థాయిలో ఉంచడానికి దర్శకధీరుడు రాజమౌళి ఎంతగానో కష్టపడ్డారు. బాహుబలి సిరీస్ ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి రేంజ్ గ్లోబల్ ఫేమ్ రాబట్టాడు. ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్గా రాజమౌళి సత్తా చాటారు దర్శకవిరుడు రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకుడు అవ్వకు ముందు తన సినిమాల్లో ఒకటి ఉండకూడదని ఫిక్స్ అయ్యారట. సీనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఒక దారుణమైన క్లైమాక్స్ చూసి ఆ నిర్ణయానికి రాజమౌళి వచ్చారు.
ఒకవేళ తను ఫ్యూచర్లో మూవీస్ కనుక తీశారు అంటే అటువంటి ఎండింగ్ కచ్చితంగా పెట్టకూడదని రాజమౌళి అనుకున్నారట. రాజమౌళి చిన్నప్పటినుండి యాక్షన్ సినిమాలు చూస్తూ బాగా ఇష్టపడే వారట. ఆయన ఫ్యామిలీలో 13 మంది కజిన్స్ ఉండేవారు. అందులో పెద్దవాళ్లు నెలకి రెండు సినిమాలు చిన్నవాళ్లు మాత్రం నెలకి ఒక సినిమా చూడాలని ఇంట్లో రూల్ ఉండేదట. అప్పట్లో వాళ్ల ఊర్లో రెండే థియేటర్లు ఉండేవట. అందులో ఒక థియేటర్లో ఎన్టీఆర్ అగ్గిపిడుగు ఇంకో థియేటర్లో మంచి చెడు అనే సినిమాలు రిలీజ్ అయ్యాయి.
Also read:
Also read:
అగ్గిపిడుగును చూసి పెద్దవాళ్ళు సినిమాలో కత్తి ఫైట్లు యాక్షన్ సీన్స్ ఉన్నాయని అన్నారట. రాజమౌళి ఎలా అయినా సినిమా చూడాలని అనుకున్నారట. అగ్గిపిడుగు సినిమాకి వెళ్దామని అనుకుంటే మంచి చెడు సినిమాలో కూడా మంచి ఫైట్లు ఉన్నాయని అబద్ధం చెప్పి కన్విన్స్ చేశారట. యాక్షన్ సీన్స్ లేకపోవడంతో రాజమౌళి నిరాశ చెందారట. ఆఖరికి హీరో చనిపోవడం ఆ ట్రాజడీ ఎండింగ్ చూసి రాజమౌళికి కోపం వచ్చింది. అప్పటికే చిరాకుతో ఉన్న రాజమౌళి ఎన్టీఆర్ చనిపోవడం చూసి భవిష్యత్తులో కనుక సినిమాలు తీశానంటే ఇటువంటి క్లైమాక్స్ పెట్టకూడదని ఫిక్స్ అయిపోయారట ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అలా ఎన్టీఆర్ సినిమా చూసి జీవితంలో ఈ విధంగా సినిమా చేయకూడదని రాజమౌళి ఫిక్స్ అయిపోయారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!