Home » “రాజధాని ఫైల్స్” సినిమా ఎలా వుంది..? కథ, రివ్యూ అండ్ రేటింగ్..!

“రాజధాని ఫైల్స్” సినిమా ఎలా వుంది..? కథ, రివ్యూ అండ్ రేటింగ్..!

by Sravya
Ad

రాజధాని ఫైల్స్ సినిమా లో వినోద్ కుమార్,అఖిలన్ పుష్పరాజ్,విశాల్ పట్నీ, వాణీ విశ్వనాథ్, వీణ తదితరులు నటించారు. భాను శంకర్ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. కంఠమనేని రవిశంకర్ ఈ సినిమా ని ప్రొడ్యూస్ చేసారు. మణిశర్మ ఈ సినిమా కి సంగీతం అందించారు. రమేష్ సినిమాటోగ్రాఫి అందించారు. ఇక ఈ సినిమా కథ, రివ్యూ అండ్ రేటింగ్ కూడా చూసేద్దాం.

నటులు: వినోద్ కుమార్,అఖిలన్ పుష్పరాజ్,విశాల్ పట్నీ,వాణీ విశ్వనాథ్,వీణ
దర్శకుడు: భాను శంకర్
నిర్మాత: కంఠమనేని రవిశంకర్
సంగీత దర్శకుడు: మణిశర్మ
సినిమాటోగ్రాఫర్‌: రమేష్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు

Advertisement

కథ మరియు వివరణ:

ఇక కథలోకి వస్తే.. బుల్లురు అనే గ్రామానికి చెందిన గౌతమ్ (పుష్పరాజ్ అఖిలన్) కి అస్సలు ఆసక్తి లేకపోయినా కూడా అరుణప్రదేశ్ కి చెందిన కొత్త రాజధాని ఐరావతి కోసం పోరాడతాడు. ఇచ్చిన భూముల విషయంలో రైతులు పడుతున్న బాధలను చూసి అతను ఈ నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న (విశాల్ పట్నాని) ఐరావతిని రాజధాని కాదని డిక్లేర్ చేయడం తో రైతులు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అనేది కథ. వారికి గౌతమ్ ఎలా సహాయం అందిస్తాడు..? చివరికి ఎవరు గెలిచారు..? అలానే అహంతో అభివృద్ధికి సమాధి కడితే ప్రజలు కోప్పడక తప్పదని రాజకీయ నాయకులు హెచ్చరించే విధంగా దర్శకుడు సినిమా ని తీశారు. ఈ సినిమా లో రాజధాని పరిధి వెలగగూడెంలోని పచ్చని పంట పొలాలు వాటితో రైతులు తరతరాలుగా ఉన్న అనుబంధాన్ని తెలిపారు.

Advertisement

 రాష్ట్ర అభివృద్ధి తమ ప్రాంత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రైతులు రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇస్తారు, అలానే రాజధాని నిర్మాణం కోసం పవిత్ర జలాలతో భూమి పూజ చేయడం కూడా ఈ మూవీ లో చూపించారు. తర్వాత వచ్చిన ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం రావడంతో పరిణామాలు మారిపోతాయి ఇవన్నీ సినిమాలో వున్నాయ్. ఇక నటీ నటుల విషయానికి వస్తే.. ఈ మూవీ లో సీనియర్ నటుడు వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ లు నటనతో ఆకట్టుకుంటారు. ఈ మూవీ కొన్ని సీన్స్ లో అయితే నటన చాలా బాగుంది. పుష్పరాజ్ అఖిలన్ పాత్ర కూడా బావుంది. సెకండాఫ్ లో తన రోల్ పై కొన్ని సన్నివేశాలు అలానే తన పెర్ఫామెన్స్ కూడా బాగున్నాయి. సీఎం పాత్రలో కనిపించిన నటుడు విశాల్ పట్నాని మాత్రం కొన్ని చోట్ల డిజప్పాయింట్ చేసాడు. ఎంగేజింగ్ నరేషన్ ఇచ్చారు. నిర్మాణ విలువలు కూడా ఓకె. టెక్నికల్ టీం లో మణిశర్మ మ్యూజిక్ కూడా ఓకే గా వుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండవచ్చు.

ప్లస్ పాయింట్స్:

నటీ నటులు
కొన్ని సన్నివేశాలు
ఎమోషన్స్

మైనస్ పాయింట్స్:

ఎడిటింగ్
ఆరంభ సన్నివేశాలు

రేటింగ్: 2.25/5

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading