సాధారణంగా స్టార్ హీరోలు, హీరోయిన్లు పెళ్లి చేసుకున్నా.. విడాకులు తీసుకున్నా అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాాజాగా ఈ కష్టకాలంలో మాకు సమయం ఇవ్వాలని దయచేసి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం అంటూ ఓ స్టార్ హీరోయిన్ ఇలా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఆ హీరోయిన్ ఎవరు..? వీరు నిజంగానే విడిపోయారా.? విడిగా అంటే విడాకులు తీసుకున్నారా..? లేక ఒకరినొకరు దూరంగా ఉంటున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరికొందరూ మాత్రం ఇలాంటిది ఏమి లేదని పేర్కొంటున్నారు. ఇంతకు వారు ఎవరు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి తన భర్తతో విడాకులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఆమె భర్త రాజ్ కుంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సందేహాలను కలిగిస్తోంది. శిల్పా భర్త రాజ్ కుంద్రా తన అధికారిక ఖాతాలో విడిపోతున్నట్టు ప్రకటించారు. శిల్పా గురించి ప్రస్తావించకుండా మేము విడిపోయామంటూ.. ఈ కష్టకాలంలో మాకు సమయం ఇవ్వాలంటూ దయచేసి అభ్యర్థిస్తున్నానని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. తన భర్త కొత్త సినిమా UT69 పోస్ట్ చేస్తూ.. రాజ్ కుంద్రాను బెస్ట్ విషెస్ తెలిపింది. దీంతో వీరిద్దరూ విడిపోవడం లేదని.. కేవలం రాజ్ కుంద్రా మాత్రమే మాస్క్ గురించి ట్వీట్ చేశాడనే క్లారిటీ వస్తోంది.
Advertisement
రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరూ పిల్లలు వియాన్, సమీషా, ఉన్నారు. ఇటీవలే రాజ్ కుంద్రా తన బయోపిక్ UT 69 ట్రైలర్ లాంచ్ లో నీ**లి చిత్రాల కేసులో జైలు జీవితం గడపడం గురించి మాట్లాడారు. 2021లో రాజ్ కుంద్రా పో*ర్న్ కేసులో ప్రధాన నిందితుడుగా అరెస్ట్ అయి కొన్నాళ్లు జైలులో ఉన్నారు. ఇక ఆ తరువాత బెయిల్ పై విడుదలయ్యాడు. బెయిల్ పై విడుదలైనప్పటి నుంచి రాజ్ ముఖాన్ని చూపించకుండా మాస్క్ ధరించి తిరుగుతున్నాడు. చాలా రోజులుగా మాస్క్ తో కనిపించిన రాజ్ కుంద్రా ఇటీవలే UT69 ట్రైలర్ లాంచ్ వేడుకలో తన మాస్క్ లో తొలగించారు. ఈ సందర్భంగా రాజ్ కుంద్రా మాట్లాడుతూ తాను నొప్పితో మాత్రమే మాస్క్ ధరించాను. మీడియా విచారణ చాలా బాధకరం. వాస్తవానికి ఇది నా చట్టపరమైన విచారణ కంటే చాలా బాధకరమైంది. తాను నిందించను.. ఎందుకంటే వారు వారి పని చేస్తున్నారు. తాను మాస్క్ ధరించి కప్పి పుచ్చుకోవాల్సి రావడం చాలా బాధకరం. నా ఇంట్లో స్టార్ ఉంది.. కానీ ఇప్పుడు నా మాస్క్ కూడా స్టార్ అయిపోయింది. మీ ముందుకు నా సినిమా రాకముందే నేనే మాస్క్ తీసేయాలని అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ప్రభాస్ కల్కి సినిమాలో.. రాజమౌళి పాత్ర ఇదే.. అంత పవర్ఫుల్ రోల్ ఆ..?