Home » అర్జున్ రెడ్డి సినిమాలో శివ పాత్రకు ఫస్ట్ చాయిస్ రాహుల్ రామకృష్ణ కాదంట.. మరి ఎవరంటే ?

అర్జున్ రెడ్డి సినిమాలో శివ పాత్రకు ఫస్ట్ చాయిస్ రాహుల్ రామకృష్ణ కాదంట.. మరి ఎవరంటే ?

by Anji
Ad

టాలీవుడ్ ప్రేక్షకులకు రాహుల్ రామకృష్ణ ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి, మహేష్ బాబు భరత్ అనే నేను, జాతి రత్నాలు వంటి సినిమాల్లో తన కామెడీతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ కమెడీయన్ గా పేరు సంపాదించుకున్న రాహుల్ రామకృష్ణ తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్నారు. 

Advertisement

ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన వ్యక్తి గత విషయాల గురించి చర్చించారు. అదేవిధంగా సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణ మాట్లాడారు. తాను హిమాయత్ నగర్ లో జన్మించానని తెలిపారు. ముఖ్యంగా తన ఫ్యామిలీకి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదని, సినిమాలపై ఆసక్తితో తాను ప్రియదర్శి, తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ ఒకేసారి సినిమాల్లో ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. పెళ్లి చూపులు సినిమాకి తరుణ్ భాస్కర్ దర్శకుడిగా అవకాశం అందుకోగా.. అందులో ప్రియదర్శి సెలక్ట్ అయ్యారు.

Advertisement

Also Read :   క్షీణించిన సమంత ఆరోగ్యం.. అపోలో ఆసుపత్రికి తరలింపు ?

Manam News

విజయ్ దేవరకొండ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాకి దర్శకుడు సందీప్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విజయ్ దేవరకొండ తనను పరిచయం చేసి ఈ చిత్రంలో తనకు అవకాశం కల్పించారు. అర్జున్ రెడ్డి సినిమాలో తాను నటించిన శివ క్యారెక్టర్ ఎంతో హైలెట్ కావడంతో తనకు ఇతర సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయని తెలిపారు. అయితే అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తరువాత డబ్బింగ్ కార్యక్రమాలు చెప్పే సమయంలో ఓ కీలక విషయం తెలిసింది.  ఈ చిత్రంలో శివ పాత్రలో నటించడానికి ముందుగా అనుకున్నది తనను కాదని.. తన స్థానంలో ప్రియ దర్శి ని సెలెక్ట్ చేశారంటూ రాహుల్ రామకృష్ణ వెల్లడించారు. ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Also Read :   ఎన్టీఆర్ న్యూలుక్.. సోషల్ మీడియా షేక్..!

Visitors Are Also Reading