Home » ఆ ముగ్గురికి దేశాన్ని దోచి పెడుతున్నారు.. ప్రధాని పై రాహుల్ గాంధీ ఫైర్

ఆ ముగ్గురికి దేశాన్ని దోచి పెడుతున్నారు.. ప్రధాని పై రాహుల్ గాంధీ ఫైర్

by Anji
Ad

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్లు చేశారు.  యావత్ దేశ సంపదను ఆ ముగ్గురికే దోచిపెడుతున్నారని ఆరోపించారు. లక్షల కోట్లు సొమ్ము మోడీ స్నేహితుల జేబుల్లోకి వెళ్లిపోతుందని ఆరోపించారు రాహుల్. తెలంగాణ సీఎం కేసీఆర్ సహా కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలను తూర్పార బట్టారు.

Advertisement

ముఖ్యంగా కేసీఆర్, నరేంద్ర మోడీ ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. ఇక్కడ దొరల పాలన, అక్కడ మతతత్వ శక్తుల దౌర్జన్యాలతో ప్రజల జీవనం అస్తవ్యస్థంగా మారిందన్నారు. సమైక్యవాద దేశాన్ని విభజిస్తున్న బీజేపీ పాలనకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణలో దొర కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు రాహుల్. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య డైరెక్ట్ లింక్ ఉందని ఆరోపించారు.  దేశంలో రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు శూన్యమంటారు. పార్లమెంట్ లో ఎన్నోసార్లు బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పని చేశాయని గుర్తు చేశారు. ఎన్నో సందర్భాల్లో రెండు పార్టీలు ఒక్కటిగా ముందుకెళ్లుతాయన్నారు. కేసీఆర్ ఫోన్ చేస్తే మోడీ వెంటనే స్పందిస్తారని, ఎన్నికలు రాగానే బీజేపీ టీఆర్ఎస్  డ్రామాలు ఆడుతాయని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ.

Advertisement

Also Read :  చలికాలంలో చుండ్రుతో బాధపడుతున్నారా ? నిమ్మరసంతో ఇలా చేస్తే అది మాయం..!

మరోవైపు రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని.. లక్షలాది మంది నిరుద్యోగులు ఫుడ్ డెలివరీ బాయ్స్ గా పని చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. దేశాభివృద్ధి చెందడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.  దేశంలోని ప్రభుత్వ సంస్థలన్నింటిని ప్రధాని మోడీ తన స్నేహితులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. బ్యాంకుల నుంచి లక్షల కోట్లు మోడీ తన స్నేహితులకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. దేశంలో బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 నుంచి రూ.1100 అయిందని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశంలో, పెట్రోల్ డీజిల్ ధరలు భారీగానే పెరిగాయి. ఓ వైపు దోచుకోవడం, మరోవైపు సామాన్యుల నడ్డి విరచడం ప్రధాని నరేంద్ర మోడీకి సర్వసాధారణం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ . ఈ అరాచక పాలనకు వ్యతిరేకంగానే భారత్ జోడో యాత్ర ప్రారంభించినట్టు తెలిపారు. దేశ సమైక్యత కోసమే జోడో యాత్ర కొనసాగుతుందన్నారు.

Also Read :  పునిత్ కుటుంబానికి రుణపడి ఉంటా.. కన్నడలో ఎన్టీఆర్ లో ఎమోషనల్ స్పీచ్..! 

Visitors Are Also Reading