ఈ సంవత్సరం చివరిలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్‌లో ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగాలనే విషయంలో జట్టు యాజమాన్యానికి ఓ స్పష్టత ఉందని టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించారు. ముఖ్యంగా నాతో పాటు రోహిత్ శర్మ, సెలక్టర్లకు కూర్పు విషయంలో ఒక స్పష్టత ఉంది. ఈ విషయంలో మేమేమీ ఒక నిర్దిష్టమైన పద్దతిని అనుసరించడం లేదు. కానీ ప్రపంచకప్‌నకు జట్టు సమతూకం ఎలాంటి కూర్పుతో ఆడాలనే విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నాం.
Also Read : ఇద్దరూ ఫిట్నెస్ ప్రియులు, హెల్తీ లైఫ్ స్టైల్..కానీ ఇద్దరి మరణానికి కారణం అదేనా..!
Advertisement
ఆటగాళ్లపై పని భారాన్ని సమీక్షిస్తూ ప్రపంచ కప్ ప్రణాళికల్లో ఉన్న అందరికీ వీలు అయినన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కచ్చితంగా ఇంతమందినే మరీ ఎక్కువ మందినీ పరీక్షించచాలని భావించడం లేదు. ప్రతీ ఒక్కరికీ ప్రపంచ కప్ ఆరంభం అయ్యే లోపు 10-20 మధ్య మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలనుకుంటున్నాం. ఒక్క మ్యాచ్ లేదా ఒక్క సిరీస్‌తో ఏ ఆటగాడిపై ఓ అంచెనాకు రాలేమని ద్రవిడ్ చెప్పాడు. టీ20 అనేది అత్యంత కఠినమైన ఫార్మాట్, సాహసంతో కూడిన ఆట ఆడాల్సి ఉంటుంది. ఎప్పుడూ షాట్లు ఆడడం సాధ్యం కాదన్నారు.
Advertisement
వెస్టిండిస్‌తో మూడవ టీ20లో రుతురాజ్, ఆవేష్‌ఖాన్ ఆ డారు. ఈ మ్యాచ్‌లో వీరి ప్రదర్శనను బట్టి ఓ ముద్ర వేయలేమని ద్రవిడ్ పేర్కొన్నాడు. సిరీస్ లో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న వెంకటేశ్ అయ్యర్ పై ప్రశంసలు కురిపించాడు ద్రవిడ్. అతను ఐపీఎల్ ఓపెనర్‌గా ఆడతాడు. మేము అతనికి మిడిల్ ఆర్డర్‌లో ఆడే బాధ్యతను అప్పగించాం. వెస్టిండిస్ సిరీస్‌తో అతను మ్యాచ్ మ్యాచ్‌కు ఇంప్రూవ్ అయ్యాడు. ఆరోబౌలర్ అంటే ప్రతీసారి బౌలింగ్ చేయాల్సిన అవసరముండదు. అంతా బాగున్నప్పుడు కెప్టెన్ అతనికి బంతి కూడా ఇవ్వకపోవచ్చు. కఠిన పరిస్థితులలో బౌలింగ్ చేయమనొచ్చు. చివరి టీ-20లో దీపక్ చాహర్ గాయపడితే వెంకటేష్‌ను అలాగే రోహిత్ బంతి ఇచ్చాడు. అతను కీలక వికెట్లలో సత్తా చాటాడు. వెస్టిండిస్ సిరీస్‌లో రాణించడం శుభపరిణామం అన్నారు.
Also Read : IPL 2022 : ఆటగాళ్లను సంతలో పశువుల్లా కొన్నారు.. ఉతప్ప వివాదస్పద వ్యాఖ్యలు