ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బిజెపి లీడర్ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ పార్లమెంట్ బరిలో ఉన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి ఆయన పోటీ చేయబోతున్నారు. పార్టీ అధిష్టానం ఆయన పేరుని దాదాపు ఖాయం చేసేసిందని వార్తలు వస్తున్నాయి. ఈయన పార్టీలో డైనమిక్ లీడర్ గా పేరు పొందారు ఆయనని బరిలో దింపడం ద్వారా కాంగ్రెస్ బీఆర్ఎస్ లకి గట్టి పోటీ ఇచ్చినట్లు అవుతుందని అధిష్టానం భావిస్తోంది. పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయనకి మంచి సంబంధాలు ఉండడం వలన ఆయన పోటీపై రాజకీయంగా ఇప్పుడు ఆసక్తి నెలకొన్నది.
Advertisement
Advertisement
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా పార్లమెంట్ పరిధిలో రఘునందన్ రావు పేరుతో పెద్ద ఎత్తున భారీ హోర్డింగ్లు పెట్టారు బిజెపిలో రఘునందన్ రావు డైనమిక్ లీడర్ అని చెప్పొచ్చు. కొంతకాలంగా దుబ్బాక నియోజకవర్గం అందిస్తున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమి చెందారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మెదక్ మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ స్థానాల్లో బిఆర్ఎస్ విజయం సాధించింది ఈ లెక్కన మెదక్లో టిఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉందని తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!