Home » ఎన్టీఆర్ సినిమాలో శ్రీదేవికి మొదటి అవకాశం వచ్చినప్పుడు రాఘవేంద్రరావు చెప్పిన మాటలు !

ఎన్టీఆర్ సినిమాలో శ్రీదేవికి మొదటి అవకాశం వచ్చినప్పుడు రాఘవేంద్రరావు చెప్పిన మాటలు !

by Anji
Published: Last Updated on

భారత చలన చిత్ర పరిశ్రమలో మొదటిసారిగా ఫీమేల్ సూపర్ స్టార్ గా బిరుదు దక్కించుకొని  ఎదిగిన నటి ఎవరైన ఉన్నారంటే.. నటి శ్రీదేవి పేరు చెప్పాలి. ఈమె అతిలోకసుందరది.. 50 ఏళ్ల సినీ కెరీర్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో నటించి భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె సినిమా ఇండస్ట్రీకి అందించిన కాంట్రిబ్యూషన్స్ ను గుర్తించి భారత ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. అయితే సిల్వర్ స్క్రీన్ పై చాలా యాక్టివ్ గా కనిపించే శ్రీదేవి బయట మాత్రం చాలా సిగ్గుపడేదట. పారితోషికం గురించి కూడా ఎవ్వరితో పెద్దగా మాట్లాడేది కాదట.

అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో పాల్గొంటూ.. ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకునేది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది శ్రీదేవి. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.  ఈ వీడియో క్లిప్ లో శ్రీదేవి మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో పని చేయడం ఒక గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఆయన డైరెక్షన్ పని చేసిన ప్రతీ హీరోయిన్ ఓ డ్రీమ్ గర్ల్ అయిపోయింది. నేను ఆయనతో చేసిన ప్రతీ సినిమా, ప్రతీ సాంగ్ సూపర్ హిట్ అయింది. నేను, రాఘవేంద్రరావు గారితో కలిసి చేసిన తొలి మూవీ పదహారేళ్ల వయసు. ఈ చిత్రం చేసిన చాలా రోజుల తరువాత ఓ రోజు రాఘవేంద్రరావు నా దగ్గరికీ వచ్చి నీకు ఇప్పుడు నేను ఓ చాలా పెద్ద షాకింగ్ న్యూస్ చెబుతున్నాను.. మనిద్దరం కలిసి మళ్లీ పని చేయబోతున్నాం అని అన్నాడు.

మళ్లీ మనం కలిసి పని చేస్తే.. అది షాకింగ్ న్యూస్ ఎందుకు అవుతుందా సార్..? ఇది చాలా మంచి న్యూస్ అవుతుందని నేను నవ్వేశాను.  అప్పుడు రాఘవేంద్రరావు గారు కలుగజేసుకొని లేదు లేదు ఈసారి నువ్వు చాలా పెద్ద హీరోతో నటించబోతున్నావు అని చెప్పారు.  చెప్పండి ఎవరు ఆయన అని నేను చాలా ఆసక్తిగా అడిగాను. ఆయన మరెవ్వరో కాదు.. నందమూరి తారకరామారావు అని చెప్పేసారు. ఆ మాట వినగానే నేను నిజంగానే షాక్ అయ్యాను అని చెప్పుకొచ్చింది. ఇంతకుముందు ఎన్టీఆర్ మనవరాలుగా నటించాను. మళ్లీ ఆయన పక్కన హీరోయిన్ గా నేను నటించగలనా అని తాను దర్శకుడు రాఘవేంద్రరావును అడిగినట్టు తెలిపింది శ్రీదేవి. ఇంతకు ముందే తాను ఎన్టీఆర్ గారితో మాట్లాడానని.. నీతో నటించడానికి ఎన్టీఆర్ కూడా చాలా సంతోషించాడని శ్రీదేవికి చెప్పాడు రాఘవేంద్రరావు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading