చాలా మంది హీరోయిన్ లు కొన్ని సినిమాల్లో నటించిన ఆ తరవాత సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. ఇక అలా దూరమైన హీరోయిన్ గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు. కొంతమంది ఇతర రంగాలలో స్థిరపడితే మరికొందరు మాత్రం పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోతారు. ఇక అలా ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ లలో ఒకరు నటి రచన.
Advertisement
READ ALSO: మాస్టర్ సినిమా హీరోయిన్ సాక్షి శివానంద్ ఎంతలా మారిపోయిందో చూడండి!
కోల్కతాలో పుట్టి పెరిగిన రచన పూర్తి పేరు జుం జుం బెనర్జీ. తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడా మరియు ఒడియా భాషలలో రచన నటించింది. తెలుగులో కన్యాదానం, పవిత్ర ప్రేమ, సుల్తాన్, రాయుడు, మావిడాకులు, లాహిరి లాహిరి లాహిరిలో మరియు బావగారు బాగున్నారా సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుని నటి రచన. వెంకటేష్ సూర్యవంశం సినిమాలో సంఘవి చేసిన క్యారెక్టర్ హిందీలో చేసింది. 2007లో ప్రోబల్ బసును పెళ్లి చేసుకుంది.
వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. సినిమాలకు దూరంగా ఉంటున్న రచన… ఇంస్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ కు చాలా దగ్గర అయిపోయింది. తాజాగా రచన ఫోటోలు వైరల్ కావడంతో ఆమె పై నెటిజన్లు ఆసక్తి కామెంట్లు చేస్తున్నారు. దాదాపు 50 ఏళ్ల వయసులోనూ గ్లామర్ బాగా మెయింటైన్ చేస్తోందని రచనపై పొగడ్తలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇక ఆ ఫోటోలను మీరు కూడా చూడండి.
Also Read: వీరసింహారెడ్డి సినిమాతో పరిటాల రవికి ఉన్న లింక్ ఏంటో తెలుసా…?
Advertisement