Telugu News » Blog » వీరసింహారెడ్డి సినిమాతో పరిటాల రవికి ఉన్న లింక్ ఏంటో తెలుసా…?

వీరసింహారెడ్డి సినిమాతో పరిటాల రవికి ఉన్న లింక్ ఏంటో తెలుసా…?

by AJAY
Published: Last Updated on
Ads

ఈ ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా విడుదలైంది. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. అయితే ఏ సినిమా కథ ను అయినా దర్శకుడు తాను విన్న, చూసిన లేదా చదివిన ఘటనలు…. అనుభవాల ఆధారంగా రాసుకుంటారు.

Advertisement

Also Read: కె.విశ్వనాథ్ తో ఎన్టీఆర్, ఏఎన్నార్ కి ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి మీకు తెలుసా ?

veerasimhareddy

కాగా వీరసింహారెడ్డి సినిమా కథను కూడా గోపీచంద్ మలినేని అలానే రాసుకున్నారు. ఈ సినిమాకు సంభందించిన ఆసక్తికర విషయాలను గోపీచంద్ మలినేని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూ లో గోపీచంద్ మలినేని మాట్లాడుతూ…….వీర సింహారెడ్డి సినిమా లోని ఇంటర్వెల్ సీన్ ను పరిటాల రవి నిజ జీవితంలో జరిగిన ఘటన ను స్ఫూర్తి గా తీసుకుని రాశానని చెప్పారు.

Advertisement

veerasimhareddy-review

అంతే కాకుండా పరిటాల రవి చనిపోయే సమయానికి ఆయన అమెరికా పర్యటన కు వెళ్లాల్సి ఉందని కానీ వెళ్ళలేదు అని చెప్పారు. అమెరికా కు వెళ్లి ఉంటే ఆయన చనిపోయే వారు కాదని చాలా మంది చెప్పుకుంటారని అన్నారు. అంతే కాకుండా వీరసింహారెడ్డి సినిమా లోని కొన్ని సీన్ లను పరిటాల రవి జీవితంలో జరిగిన కొన్ని ఘటన ల ఆధారంగా రాసుకున్నట్టు తెలిపారు.

ఇదిలా ఉంటే పరిటాల రవి ఏపీలోని పేరు మోసిన నాయకులలో ఒకరు. మాస్ లీడర్ గా ఆయన ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కాగా ఫ్యాక్షన్ గొడవల నేపథ్యంలోనే ఆయన ను ప్రత్యర్థులు హతమార్చారు. ఇక ఆయన చనిపోయినా ఆయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.

Advertisement

Also read : Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి

You may also like