ప్రస్తుత టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు అనేది అందరికి తెలిసిందే. అయితే రోహిత్ శర్మ ఎప్పటి నుండో క్రికెట్ అనేది ఆడుతున్న.. అతనికి ప్రత్యేక గుర్తింపు అనేది వచ్చింది 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుండి అనే చెప్పాలి. అప్పటి వరకు మిడిల్ ఆర్డర్ లో ఆడే రోహిత్ తో కెప్టెన్ ధోని ఓపెనింగ్ చేయించాడు. అది సూపర్ సక్సెస్ అయ్యింది.
Advertisement
అయితే అప్పుడు ధోని తన విషయంలో చేసిన పనినే ఇప్పుడు రోహిత్ శర్మ సూర్య కుమార్ యాదవ్ విషయంలో చేస్తున్నాడు అని భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ అన్నారు. అయితే టీం ఇండియాలోకి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా వచ్చిన సూర్యను ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ లో ఓపెనర్ గా అవకాశం ఇచ్చాడు రోహిత్ శర్మ. ఇక తాజాగా జరిగిన మూడో మ్యాచ్ లో సూర్య 73 పరుగులతో అదరగొట్టాడు.
Advertisement
ఇదే విషయంపై ఆర్ శ్రీధర్ మాట్లాడుతూ.. అప్పుడు ధోని ఎలా అయితే రోహిత్ ను ఓపెనర్ గా పంపి జట్టుకు ఓ మ్యాచ్ విన్నర్ ను అందించాడో.. ఇప్పుడు రోహిత్ కూడా సూర్యను ఇలానే ఓపెనర్ గా ప్రయత్నించి సక్సెస్ అనేది అవుతున్నాడు. కాబట్టి సూర్య జట్టుకు మంచి ఓపెనర్ గా తయారవుతాడు అని ఆర్ శ్రీధర్ అన్నాడు. ఇక ఈ సిరీస్ లో ఇంకా రెండు మ్యాచ్ లు ఉండటంతో ఓపెనర్ గా సూర్య ఏం చేస్తాడు అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి :