Home » R. నారాయణమూర్తికి ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టమట.. ఎవరంటే..?

R. నారాయణమూర్తికి ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టమట.. ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ డైరెక్టర్ గా.. యాక్టర్ గా..పేరు పొందారు ఆర్.నారాయణమూర్తి.. ఆయన తీసిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ గా నిలిచాయి. రాజకీయ నాయకులు మామూలు జనాలను ఏ విధంగా వాడుకొని చిత్రహింసలకు గురిపెడతారు. పేదోడు తన హక్కులను ఏ విధంగా సాధించుకోవాలో, నక్స*ట్లు ఉంటే ఏం జరుగుతుందో అనే విషయాలను తన సినిమాల ద్వారా చాటి చెప్పిన ఏకైక నటుడు ఆర్.నారాయణమూర్తి అని చెప్పవచ్చు.

Advertisement

Also read;జియో సంచలన నిర్ణయం… 11 భాషల్లో ఉచితంగా ఐపీఎల్ 2023 సీజన్ ప్రసారాలు…!

ఈ విధంగా ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఆయన. ఇంత పెద్ద యాక్టర్ అయినా కానీ చాలా సాదాసీదాగా ఉంటారు నారాయణమూర్తి. ఆయన ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటో లేదా ఆర్టీసీ బస్సులో లేదంటే కాలి నడకన వెళుతూ ఉంటారు. ఇండస్ట్రీలో ఆయన ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు చేశారు. అందులో ముఖ్యంగా ఎర్రసైన్యం, చీమలదండు, ఒరేయ్ రిక్షా ఈ విధంగా ఇండస్ట్రీని షేక్ చేసిన ఎన్నో సినిమాలు ఆయన సొంతమని చెప్పవచ్చు.

Advertisement

ఇలా ఎంత సంపాదించినా మనం పోయే ముందు ఏం తీసుకుపోతాం అనే విధమైన భావజాలంతో సాదాసీదా జీవనాన్ని గడుపుతున్న ఆర్.నారాయణమూర్తికి ఈ తరం హీరోయిన్లలో ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టమట.. ఇంతకీ ఆ అదృష్ట హీరోయిన్ ఎవరయ్యా అంటే.. సాయి పల్లవి.. సాధారణంగా ఇండస్ట్రీలో నారాయణమూర్తి ఎవరైనా హీరోయిన్ బాగా నటిస్తే వారిని పొగుడుతారు. నటన బాగుంటే బాగా చేసింది అంటారు. కానీ సాయి పల్లవి నటనకు ఆయన ఫిదా అయ్యారట. అందుకే ఇండస్ట్రీలో ఆయనకు ఇష్టమైన హీరోయిన్ అని చెబుతూ ఉంటారు.

Also read;తెలంగాణ పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. అర్హతలు, దరఖాస్తు తేదీలివే

Visitors Are Also Reading