Home » రోజా సినిమాల్లో ఎంత సంపాదించిందో తెలుసా…?

రోజా సినిమాల్లో ఎంత సంపాదించిందో తెలుసా…?

by Azhar
Ad

రోజా… ఇప్పుడు ఏపీలో మంత్రిగా ఉన్నారు. కానీ ఆమె హీరోయిన్ గానే ప్రజలకు ఎక్కువ పరిచయం. దాదాపు 2000 సంవత్సరంలో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది రోజా. అప్పటి నుండి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తన సమయంలో ఉన్న అందరూ సూపర్ స్టార్ హీరోలతో నటించిన రోజా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు అనేది తెచ్చుకుంది. ఇక హీరోయిన్ గా మంచి గుర్తింపు అనేది వచ్చిన తర్వాత.. అటూహీరోలతో కలిసి నటిస్తూనే.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో కూడా చేసింది. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా తనకు అవకాశాలు తగ్గిన తరుణంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

Advertisement

ఇక అందులో భాగంగా హీరో, హీరోయిన్ తల్లిగా నటించిన రోజా.. 2013 లో ప్రారంభమైన జబర్దస్త్ లోకి జడ్జ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ షో అనేది సూపర్ హిట్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రల ప్రజలకు మరింత దగ్గరైంది రోజా. ఇక ఇందులో చేస్తూనే సినిమాలు, రాజకీయాలు నడిపించిన రోజా.. తాజాగా సీఎం జగన్ క్యాబినెట్ లో మంత్రిగా అవకాశం రావడంతో జబర్దస్త్ తో పాటుగా మొత్తం సినిమా ప్రపంచాన్ని వదిలేసింది. అయితే తాజాగా రోజా కొత్తగా మెర్సిడెస్-బెంజ్ కారును కొనుగోలు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Advertisement

ఇక ఇదే సమయంలో రోజా… సినిమాలో, జబర్దస్త్ లో చేసి ఇప్పటివరకు మొత్తం ఎంత సంపాదించింది అనే అంశం తెరపైకి వచ్చింది. ఇక ఇదే సమయంలో రోజా ఆస్తుల వివరాలు తెలిసిన తర్వాత అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే.. రోజా ఇప్పటివరకు సంపాదించిన మొత్తం ఆస్థిన విలువ ఏడున్నర కోట్లేనట. దాంతో రోజా ఆస్తి ఇప్పటివరకు ఎంతో అనుకున్నవారు.. ఇప్పుడు తక్కువ అని తెలిసి షాక్ అవుతున్నారు. అయితే ఇప్పుడు జగన్ క్యాబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్న రోజా.. ఇప్పుడు ఇండస్ట్రీకి పూర్తిగా దూరం కావడం ఫ్యాన్స్ ను కొంత భాదిస్తుంది.

ఇవి కూడా చదవండి :

బాబర్ మెసేజ్ పై స్పందించిన విరాట్ కోహ్లీ..!

ఉమ్రాన్ కెరియర్ నాశనం చేస్తున్న బీసీసీఐ..!

Visitors Are Also Reading