Home » హైదరాబాద్‌ కోహినూర్‌గా పేరుగాంచిన ఈ యువరాణి ఎందరికో ఆదర్శం..!

హైదరాబాద్‌ కోహినూర్‌గా పేరుగాంచిన ఈ యువరాణి ఎందరికో ఆదర్శం..!

by Sravya
Ad

భారతదేశానికి స్వాతంత్రం రాకముందు అలానే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మహిళల హక్కుల కోసం చాలామంది పోరాడారు. మహిళా యోధుల గురించి చెప్పాలంటే చాలా చెప్పడానికి ఉంది. లెక్క పెట్టలేనంతమంది మహిళ హక్కుల కోసం పోరాడారు వాళ్ళలో కొంతమంది అయితే రాజు కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్లలో ప్రధానురాలు నిలుఫర్. హైదరాబాదులోని కోహినూర్ గా ప్రసిద్ధి చెందారు నిలుఫర్ ఇండియాలో మహిళల హక్కుల కోసం అలానే ఆరోగ్య సంరక్షణలో పెద్ద విప్లవానికి నిలుఫర్ నాయకత్వాన్ని వహించారు.

 హైదరాబాద్ రాజరిక కుటుంబంలో వివాహం చేసుకున్న ఈమె అనర్హుల కోసం తన ప్రత్యేక హోదాని ఉపయోగించుకోవడం జరిగింది. ఇండియాలో మహిళల హక్కులు అలానే ఆరోగ్య సంరక్షణలో పెద్ద విప్లవానికి ఈమె బాధ్యత తీసుకున్నారు. భారతదేశం యొక్క ప్రసిద్ధ అందమైన యువరాణుల్లో నిలుఫర్ కూడా ఒకరు. మహిళల స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ఆమె తన జీవితాన్ని దార పోశారు. నిలోఫర్ జనవరి 4 ,1916 ఇస్తానబుల్ లోని ఓ ప్యాలెస్ లో పుట్టారు. ఆమె తల్లి ఆమెని పెంచారు. ఆమె రెండేళ్ల వయసులో తండ్రి చనిపోయారు.

Advertisement

Also read:

Advertisement

తర్వాత ఆమె కుటుంబం 1924లో ఫ్రాన్స్ కి వెళ్ళిపోయింది కుటుంబ కష్టాలు ఉన్నా కూడా నిలుఫర్ అందం రాజవంశం ఆమెని పై స్థాయిలో నిలబెట్టాయి. ఎక్కువ డిమాండ్ ఉన్న వధువుల్లో ఈమె కూడా ఒకరు. ఈమె వివాహం హైదరాబాద్ లోని సంపన్న శక్తివంతమైన నిజాంతో జరిగింది. ఈ యువరాణి వివాహం ప్రిన్స్ మోవజాం జాతో జరిగింది నిలుఫర్ మహిళలు పిల్లల కోసం ప్రత్యేక ఆసుపత్రిను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ నిజాం ని సంప్రదించారు. 1953లో హాస్పిటల్ ని ప్రారంభించాలని పట్టుదల తో ముందుకు వెళ్లారు ఆమె అనుకున్నట్లుగా ఆసుపత్రాన్ని నిర్మించగలిగారు. ఈమె కృషి ఇండియాలో మహిళల ఆరోగ్యం అలానే సాధికారతలో పురోగతికి పునాది వేసింది. ఎంతో మందికి ఎన్నో రకాలుగా నిలువ సేవలందించారు చాలామందికి మహిళలకి ఆదర్శంగా నిలిచారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading