ఇన్ని రోజుల నిరీక్షణ మధ్య డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన మూవీ లైగర్ భారీ అంచనాల నడుమ సినిమా ఆగస్టు 25వ తేదీన థియేటర్ లోకి వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ అభిమానులు ఎక్స్పెక్ట్ చేసినంత లేదని అభిప్రాయపడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం సినిమాను చూడవచ్చని అంటున్నారు. కానీ సినిమా మాత్రం మంచి కలెక్షన్లు రాబడుతోంది అని చెప్పవచ్చు. మొదటి సారి పాన్ ఇండియా లెవెల్ లో విజయ్ వచ్చాడు కాబట్టి, అలాగే మొదటి సినిమా అల్లు అర్జున్ పుష్పాతో ఈ మూవీని కంపేర్ చేసి చూస్తే ఎలా రిజల్ట్ వచ్చిందా చూద్దాం..
Advertisement
ALSO READ:పాకిస్థాన్ ఒక్క ఆఫ్ఘన్ టీం లాంటిదే…!
Advertisement
పుష్ప మొదటిరోజు కలెక్షన్స్ తెలుగులో 31 కోట్లు, , హిందీలో మూడు కోట్లు, తమిళ్లో రెండున్నర కోట్లు, మలయాళంలో ఒకటిన్నర మొత్తం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు 45.45 కోట్లు..
ఇక టైగర్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే హిందీలో 8 కోట్లు, ఏపీ తెలంగాణ 17 కోట్లు. కర్ణాటక రెండున్నర కోట్లు, ఇతరాత్ర 6 కోట్లు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ చూస్తే 25.7 ఈ లెక్కన రెండింటినీ కలిపి చూస్తే పుష్ప మరియు లైగర్ కంపేరిజన్ చూస్తే విజయ్ దేవరకొండ మాత్రం ఇంకా బాగానే కష్టపడాలని అర్థమవుతోంది.
టైగర్ మూవీ కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డారు విజయ్. అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమా కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. అయితే సినిమా ట్రైలర్ చూసిన వారు మాత్రం తప్పనిసరిగా సినిమా హిట్ కొడుతుందని భావించారు. కానీ ట్రైలర్ లో ఉన్నంత విషయం సినిమాలో లేదనే మాట వినిపిస్తోంది. కానీ చిత్ర యూనిట్ పడ్డ కష్టానికి ప్రతిఫలం వస్తే బాగుంటుందని సినీ విశ్లేషకుల మాట.
ALSO READ:లైగర్ ను వదిలేసిన ఎన్టీఆర్… ఎందుకు..?