Home » “పుష్ప 2 ” మార్చిలో రిలీజ్ అనుకున్నారు కానీ ఆగష్టు 15 నే ఎందుకు విడుదల చేయబోతున్నారో తెలుసా ?

“పుష్ప 2 ” మార్చిలో రిలీజ్ అనుకున్నారు కానీ ఆగష్టు 15 నే ఎందుకు విడుదల చేయబోతున్నారో తెలుసా ?

by Anji
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరమే లేదు. గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అయినప్పటికీ అంతగా అల్లు అర్జున్ కి గుర్తింపు రాలేదు. దర్శకుడు రాఘవేంద్రరావుకే గుర్తింపు లభించింది. కానీ ఆ తరువాత సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య సినిమాతో అల్లు అర్జున్ కి ఒక్కసారిగా ఇమేజ్ పెరిగిపోయింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు  తన రేంజ్ అంచెలంచెలుగా పెరిగిపోయింది. 

pushpa-2-teaser

Advertisement

 

పుష్ప మూవీతో జాతీయ అవార్డు అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ చేస్తున్నాడు అల్లు అర్జున్.  అవార్డు వచ్చిన ఆనందంతో మరింత ఎనర్జీతో పని చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల డేట్ ని ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్. అలాగే సరికొత్త పోస్టర్ ని పోస్ట్ చేశారు. డిసెంబర్ 21, 2021 పుష్ థియేటర్ లో విడుదలైంది. తొలుత దీనిని కేవలం టాలీవుడ్ కి మాత్రమే అనుకున్నారు. ఇక ఆ తరువాత రాజమౌళి సూచనతో ఎలాంటి ప్రచారం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. తెలుగుతో మిక్స్ డ్ టాక్ లభించింది. నార్త్ లో మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది.

Advertisement

ఇక దీంతో పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్-సుకుమార్ మరిన్ని జాగ్రత్తలను తీసుకున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేయాలని మూవీ మేకర్స్ ఫిక్స్ అయ్యారు. తాజాగా ఈ చిత్రం విడుదలకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. తేదీ విడుదల కన్ఫర్మ్ చేసేందుకు పెద్ద కారణం అయింది. ఆగస్టు 15 పబ్లిక్ హాలీ డే ఎలాగో సెలవుంటుంది. ఆ రోజు గురువారం. ఇక ఆ తరువాత శుక్ర, శని, ఆదివారం వీకెండ్. సోమవారం ఆగస్టు 19 రక్షాబంధన్, ఇలా 5 రోజుల పాటు లాంగ్ వీకెండ్ ఉంది. ఆగస్టు 23 నుంచి 25 వరకు వీకెండ్.  ఈ సినిమాకు అద్భుతమైన వసూళ్లు దక్కే అవకాశముంది. ఆగస్టు 15న కమల్ హాసన్-శంకర్  కాంబోలో తెరకెక్కే భారతీయుడు 2 మూవీ కూడా విడుదల చేయనున్నారు. వరుసగా 5 రోజులు మొదటివారంలో.. రెండో వారంలో నాలుగు రోజులు వీకెండ్ ఉండటంతో ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం సుకుమార్ చాలా కష్టపడుతున్నట్టు సమాచారం. ఆగస్టు 15, 2023న విడుదలయ్యే పుష్ప 2 మూవీ కూడా మంచి సక్సెస్ సాధిస్తుందో లేదో  వేచి చూడాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 Akkineni Nagarjuna : తాగుబోతుగా మారిన నాగార్జున.. అమలతో గొడవ ?

Lavanya Tripathi : పెళ్ళికి ముందు లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం !

Visitors Are Also Reading