Home » Pushpa 2: మైండ్ బ్లోయింగ్ పాత్రలో సాయిపల్లవి.. వారి మధ్య లవ్ ఏ రేంజ్ లో అంటే..?

Pushpa 2: మైండ్ బ్లోయింగ్ పాత్రలో సాయిపల్లవి.. వారి మధ్య లవ్ ఏ రేంజ్ లో అంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

కరోణ నుంచి కోలుకొని సినిమా ఇండస్ట్రీ కాస్త గాడిన పడ్డ తర్వాత వచ్చిన మొదటి సినిమా పుష్ప.. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో అంచనాల మధ్య థియేటర్ లోకి వచ్చిన ఈ మూవీ సెన్సేషన్ హిట్ సాధించింది.. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిందని చెప్పవచ్చు. అయితే సినిమా హిట్ అయిన వెంటనే దీనికి సీక్వెల్ గా పుష్ప 2కూడా తెరకెక్కనుందని డైరెక్టర్ చెప్పుకొచ్చారు. పుష్ప 2 షూటింగ్ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement

also read:

ఈ తరుణంలోనే ఈ సినిమా గురించి అనేక వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన, సమంతా స్పెషల్ డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇక పుష్ప టూ లో సాయి పల్లవి కూడా నటించనుందని తెలుస్తోంది. ఇందులో ఈమె పాత్ర హైలెట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. పుష్ప సినిమా ఏ విధంగా హిట్ కొట్టిందో దానికి కొనసాగింపుగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పుష్పా కు మించి పుష్ప2 తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. దీనికోసం పాత నటీనటులతో పాటుగా ఇంకొంతమంది క్రేజ్ ఉన్న నటీనటులను రంగంలోకి దిగిన ఉన్నారట సుకుమార్.

Advertisement

ఈ క్రమంలోనే నేచురల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి ఈ సినిమాలో నటించబోతుందని టాక్. ఇటీవల డైరెక్టర్ ఆమెను కలిసినప్పుడు సాయి పల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి కోసం సుకుమార్ ఒక ప్రత్యేకమైన అద్భుతమైన పాత్రను డిజైన్ చేశారట. అదేంటంటే అడవుల్లో తిరిగేటువంటి గిరిజన యువతిగా సాయిపల్లవి రోల్ ఉండనుందని, ఇందులో పుష్ప రాజు తో పాటు సాయి పల్లవి లవ్ ట్రాక్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం బయటకు రావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

also read:అల్లు అర‌వింద్ స‌తీమ‌ణి కండీష‌న్ మామూలుగా లేదుగా.. అది ఒప్పుకున్నందుకే బ‌న్నితో స్నేహా పెళ్లి జ‌రిగిందా..?

Visitors Are Also Reading