Ad
ప్రస్తుతం మన సౌత్ సినిమాలు బాలీవుడ్ లో సూపర్ హిట్ అవుతున్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు అక్కడి అభిమానుల చూపు మొత్తం మన వైపే పడింది. అయితే బాలీవుడ్ అభిమానులు ఇప్పుడు ఎక్కువగా ఎదురు చూస్తున్న సినిమాలో పుష్ప 2 , సాలార్ అనేవి ముందు వరుసలో ఉంటాయి. ఇందులో ఒక్క సినిమాలో అల్లు అర్జున్.. మరో సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారు. అయితే బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన… పుష్ప సూపర్ హిట్ కావడంతో.. ఈ సినిమా పై అంచనాలు ఎక్కువయ్యాయి. అలాగే పాండ్ ఇండియా హీరో ప్రభాస్.. దానికి తోడు కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సాలార్ కావడంతో దీని పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఇప్పటికే సాలార్ నుండి వచ్చిన ఫస్ట్ లుక్ జనాలను బాగా ఆకట్టుకుంది. అందుకే జనాలు ఈ రెండు సినిమాలు ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం… ఈ రెండు సినిమాలు ఒక్కేసారి రాబోతున్నట్లు తెలుస్తుంది. ఒక్కేసారి అంటే.. ఒక్కే రోజు కాకుండా.. ఒక్కే నెలలో 20 రోజుల గ్యాప్ తో విడుదల కాబోతున్నాయి అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలు ఇలా విడుదల కావడం వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అదేంటంటే.. బాలీవుడ్ పై పట్టు సాధించడం.
అయితే ఇప్పటివారకు చూసినట్లయితే… బాహుబలి 2 సక్సెస్ అయితే తర్వాత బాలీవుడ్ సౌత్ గురించి పెద్దగా పంటించుకోలేదు. కానీ ఈ మధ్య కలంలో పుష్ప.. కొంత గ్యాప్ తో ఆర్ఆర్ఆర్… ఆ తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తో కేజిఎఫ్ సినిమాలు విడుదలై సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దాంతో మొత్తం సౌత్ సినిమాలు ఒక్కదాని వెనుక మరొకటి వచ్చి సూపర్ హిట్స్.. కోట్లు కొల్లగొట్టడంతో బాలీవుడ్ పని ముగిసిపోయింది అని అంటూ… వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా అలాగే సూపర్ హిట్ అయ్యే ఈ రెండు సినిమాలు ఒక్కేసారి.. కొంత గ్యాప్ తో విడుదల కావడంతో సౌత్ పట్టు బాలీవుడ్ పై మరింత సాధిస్తుంది అని చాలా మంది అనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
భువీ నిజంగా 200 కీ.మీతో బంతి విసిరాడా..?
రోహిత్ ను టీ20 కెప్టెన్ గా తప్పించాలి అంటున్న సెహ్వాగ్…!
Advertisement