Home » రోహిత్ ను టీ20 కెప్టెన్ గా తప్పించాలి అంటున్న సెహ్వాగ్…!

రోహిత్ ను టీ20 కెప్టెన్ గా తప్పించాలి అంటున్న సెహ్వాగ్…!

by Azhar
Ad

టీం ఇండియాకు ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. అయితే కోహ్లీ తప్పునా తర్వాత రోహిత్ ఈ స్థానానికి వచ్చాడు. అయితే వచ్చిన మొదట్లో పరుగులు చేయకపోయినా.. జట్టును సిరీస్లు గెలిపించిన రోహిత్ శర్మ కెప్టెన్సీ పై అందరూ ప్రశంసలు కురిపించారు. కానీ ఆ తర్వాత ఐపీఎల్ 2022 లో రోహిత్ జట్టు ముంబై ఇండియన్స్ పూర్తిగా విఫలం కావడంతో.. ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీ పై ప్రశ్నలు వస్తున్నాయి. పరుగులు కూడా చేయలేకపోతున్న రోహిత్.. ఐపీఎల్ తర్వాత విశ్రాంతి పేరిట సౌత్ ఆఫ్రికా సిరీస్ లో ఆడలేదు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన కరోనా రావడంతో దాదాపు మ్యాచ్ కు దూరమయ్యాడు.

Advertisement

దాంతో రోహిత్ కు కెప్టెన్సీ వేస్ట్ అని.. ఎక్కువగా ఫిట్నెస్ లేక ఒత్తిడితో పరుగులు చేయలేకపోతున్నాడు అని అంటున్నారు. ఇక ఇప్పుడు భారత మాజీ ఓపెనర్ సెహ్వాగ్ కూడా ఇదే చెబుతున్నారు. రోహిత్ ను టీ20 ఫార్మాట్ లో కెప్టెన్ గా తప్పించాలని బీసీసీఐకి సూచించాడు. తాజాగా సెహ్వాగ్ మాటాడుతూ.. రోహిత్ శర్మ వయస్సును దృష్టిలో ఉంచుకొని.. మీరు అతడిని టీ20 నాయకునిగా తప్పించి.. ఎవరైనా యువ ఆటగానికి అప్పగించాలి. అందువల్ల అతని పైన ఒత్తిడి తగ్గుతుంది. ఆ కారణంగా రోహిత్ వన్డే, టెస్టులో బాగ్ రాణించగలడు అని అంటున్నారు.

Advertisement

అయితే ఈ కథ అంత వింటుంటే.. అచ్చం మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కథలగే అనిపిస్తుంది. పరుగులు చేయలేకపోతుండటంతో కోహ్లీపై ఒత్తిడిని తగ్గించడానికి టీ20 కెప్టెన్ గా తప్పించాలని చాలా మంది అన్నారు. దాంతో కోహ్లీనే స్వయంగా తప్పుకున్నాడు. ఆ తర్వాత వైట్ బాల్ ఫార్మాట్ లో ఇద్దరు కెప్టెన్లు ఉండదు అని బీసీసీఐ స్వయంగా కోహ్లీని కెప్టెన్ గా తప్పించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ కోహ్లీనే మళ్ళీ టెస్ట్ కెప్టెన్ గా తప్పుకున్నాడు. ఇక అప్పుడు ఐపీఎల్ లో బాగా రాణించిన రోహిత్ కు కెప్టెన్సీ ఇచ్చారు. ఇక ఇప్పుడు కూడా రోహిత్ ను తప్పిస్తే.. ఐపీఎల్ లో రాణిస్తున్న పాండ్యకు కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

పాండ్య పేరిట అరుదైన రికార్డ్… ధోని, కోహ్లీ, రోహిత్ లకు కూడా సాధ్యం…

రోహిత్ పై తన కోపాన్ని వ్యక్తపరిచిన పాండ్య…!

Visitors Are Also Reading