Home » భువీ నిజంగా 200 కీ.మీతో బంతి విసిరాడా..?

భువీ నిజంగా 200 కీ.మీతో బంతి విసిరాడా..?

by Azhar
టీం ఇండియాలో చాలా ముఖ్యమైన.. పేరు తెచ్చుకున్నా ఆటగాళ్లలో పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఒక్కడు. అయితే భారత జట్టుకు మూడు ఫార్మాట్ లలో ఆడాల్సిన భువీ ఫిట్నెస్ కారణంగా ఆడలేకపోతున్నాడు. అయితే భువీ ఎంత అద్భుతమైన బౌలర్ అనేది అందరికి తెలుసు. కానీ ఎక్కువగా గాయాలపలు కావడంతో జట్టులోకి వాస్తు పోతు ఉంటాడు. అయితే ఈ ఏడాది మాత్రం భువీ మంచి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తుంది. అందుకే ఐపీఎల్ లో సహా జట్టుకు కూడా అందుబాటులో ఉంటున్నాడు. భువీ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. అందుకే అతడిని స్వింగ్ కింగ్ అని పిలుస్తుంటారు.
బంతిని బాగా స్వింగ్ చేసే భువీ ఎక్కువ వేగంగా బంతిని వేయలేడు అనేది అందరికి తెలుసు. కానీ తాజాగా భువీ వేసిన స్పీడ్ చూస్తే అందరూ షాక్ కావాల్సిందే. ప్రస్తుతం ఐర్లాండ్ లో రెండు టీ20 ల సిరీస్ ఆడుతున్న భువీ.. నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో ఏకంగా 208 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరినట్లు స్పీడ్ మీటర్ చూపించింది. దాంతో ఆటగాళ్లతో పాటుగా.. అభిమానులు.. కామెంటేటర్లు స్వయంగా భువీ కూడా చాలా అవాక్కయ్యాడు. ఎందుకంటే అది ప్రపంచ రికార్డ్ అవుతుంది. ప్రస్తుతం ఈ రికార్డ్ పాకిస్థాన్ బౌలర్ అహొయబ్ అక్తర్ పేరిట ఉంది. 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి ఈ ఘనతను అందుకున్నాడు.
మాములుగా అక్తర్ రికార్డ్ ను ఉమ్రాన్ మాలిక్ బ్రేక్ చేస్తాడు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే గంటకు 150 కంటే ఎక్కువ వేగంతో బంతిని విసిరే ఉమ్రాన్ ఈ అక్తర్ రికార్డ్ బ్రేక్ చేస్తాడు అని అందరూ అనుకుంటే.. భువీ ఏకంగా 200 కంటే ఎక్కువ వేగంతో బంతిని విసిరాడు అని అందరూ అనుకున్నారు. కానీ చివర్లో తెలిసింది ఏంటంటే.. స్పీడ్ మీటర్ తప్పు చూపించిందని. ఎందుకంటే ఒక్క మనిషి ఇంత వేగంగా బౌన్గ్ చేయడం అసాధ్యం. గతంలో కూడా ఓ శ్రీలంక బౌలర్ విషయంలో ఇలానే జరిగింది. అతను 175 వేగంతో బంతి విసినట్లు చెప్పి… తర్వాత మిషిన్ తప్పు చూపించింది అని పేర్కొన్నారు.
Visitors Are Also Reading