Home » ఆ సీనియర్ హీరోతో పూరీ సినిమా..?

ఆ సీనియర్ హీరోతో పూరీ సినిమా..?

by Azhar
Ad

టాలీవుడ్ లో టాప్ దర్శకులలో ఒక్కడిగా ఉన్న పూరీ జగన్నాథ్ ప్రస్తుతం చెత్త డిజాస్టర్ సినిమా వల్ల కష్టాల్లో పడ్డాడు అనే చెప్పాలి. గతంలో కూడా వరుస ప్లాప్ సినిమాల వల్ల పూరీకి అవకాశాలు అనేవి రాలేదు అనే విషయం అందరికి తెలిసిందే. కానీ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతీసి మల్లి ట్రాక్ అనేది ఎక్కాడు. ఇక ఈ సినిమా తరువాత నేరుగా పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసాడు.

Advertisement

విజయ్ దేవరకొండ హీరోగా.. అనన్య పాండే హీరోయిన్ గా లైగర్ అనే సినిమా తీసాడు పూరీ. పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన ఈ సినిమా అదే లెవల్ లో పెద్ద ప్లాప్ గా నిలిచింది. దాంతో పూరీకి మల్లి కష్టాలు అనేవి మొదలయ్యాయి అని తెలుస్తుంది. కానీ ఈ సినిమా విడుదలకు ముందే మళ్ళీ విజయ్ తోనే పూరీ జనగణమన అనే సినిమా ప్రారంభించాడు.

Advertisement

కానీ లైగర్ దెబ్బకు ఆ సినిమా అనేది అఆగిపోయినట్లు కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు కొత్త హీరోను వెతికే పనిలో పడ్డ పూరీ.. టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒక్కరు అయిన బాలకృష్ణతో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కాంబోలో గతంలో పైసా వసూల్ అనే సినిమా వచ్చింది. ఆ సమయంలోనే మళ్ళీ బాలయ్యతో సినిమా ఉంటుంది అని పూరీ అన్నారు. ఇప్పుడు ఆ కష్ట కాలంలో మళ్ళీ ఆయనతో సినిమానే సినిమా చేయాలనీ పూరీ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :

ఆసీస్ పైన ఓడిపోతే ప్రపంచ కప్ పోయినట్లే…!

భారత జట్టు కొత్త జెర్సీ వెనుక ఇంత కథ ఉందా..?

Visitors Are Also Reading