Home » 23 బంతుల్లో బీభత్సం సృష్టించిన పంజాబ్ ప్లేయర్.. ఆల్ రౌండ్ షో అదుర్స్..!

23 బంతుల్లో బీభత్సం సృష్టించిన పంజాబ్ ప్లేయర్.. ఆల్ రౌండ్ షో అదుర్స్..!

by Anji
Ad

సాధారణంగా  క్రికెట్ లో ఎప్పుడు ఏ బౌలర్ ఎక్కువగా వికెట్లు తీస్తారో.. ఏ బ్యాట్స్ మెన్ పరుగులు సాధిస్తాడో అస్సలు ఊహించలేము. ముఖ్యంగా టీ 20  మ్యాచ్ లలో ఎక్కువగా ఓవైపు పరుగుల వరద పారుతుంటే మరోవైపు వికెట్లు అలా అన్నింటిలో మెరుగ్గా రాణించిన జట్టే చివరికీ విజయం సాధిస్తుంది. తాజాగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో కోవై కింగ్స్ విజయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా మధురై పాంథర్స్ తో జరిగిన మ్యాచ్ కోవై కింగ్స్ 44 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 

Advertisement

ఇక ఈ గెలుపులో అటు బంతి.. ఇటు బ్యాట్ తో కీలక పాత్ర పోషించాడు ఆ జట్టు సారథి షారూఖ్ ఖాన్. తొలుత బ్యాటింగ్ చేసిన కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కెప్టెన్ షారూఖ్ ఖాన్ (53), సచిన్ (67), సురేష్ కుమార్ (64) అద్బుతంగా ఆడి అర్ద సెంచరీలు సాధించారు. ముఖ్యంగా కోవై కింగ్స్ కెప్టెన్ షారూఖ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 20 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాప్ సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 23 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్ లతో 53 పరుగులు చేశాడు. 

Advertisement

తొలుత బ్యాట్ తో ఆకట్టుకున్న షారుఖ్ ఖాన్.. ఇక ఆ తరువాత బంతితో కూడా రాణించాడు. 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగి మధురై పాంథర్స్ జట్టును షారుఖ్ ఖాన్ (2/35) సిద్దార్థ్ (3/32), యదీశ్వరన్(2/16) అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. దీని ఫలితంగా మధురై జట్టు కేవలం 18 ఓవర్లకే 164 పరుగులు సాధించి ఆలౌట్ అయింది. దీంతో కోవై కింగ్స్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

తొండాట ఆడి ఇంగ్లాండ్ పై గెలిచిన ఆస్ట్రేలియా… ఇక వీళ్లు మారరు రా ?

 ICC : వరల్డ్ కప్​ షెడ్యూల్​లో టీమిండియాకు అన్యాయం! ఐసీసీ కావాలనే చేసిందా?

Visitors Are Also Reading