ఆసియా కప్ లో ఫ్యాన్స్ ను దారుణంగా నిరాశ పరిచిన భారత జట్టు వచ్చే నెల చివర్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తుంది. అయితే ఈ టోర్నీకి ఇంకా జట్టును అయితే బీసీసీఐ ఎంపిక చేయలేదు. కానీ ఆయా జట్టు ఎలా ఉండాలి అనే విషయంపై మాజీలు ఇప్పటికే చాలా విషయాలు చెప్పగా.. తాజాగా భారత టెస్ట్ బ్యాటర్ పుజారా కూడా కామెంట్స్ చేసాడు.
Advertisement
భారత ప్రపంచ కప్ జట్టు గురించి పుజారా మాట్లాడుతూ.. ఆసియా కప్ వల్ల మన భారత జట్టు బ్యాటింగ్ లో మిడిల్ ఆర్డర్ బలం ఇంకా పెంచాలి అనే విషయం అందరికి అర్ధం అయ్యింది. అందుకే మిడిల్ ఆర్డర్ లో కీలకమైన 5వ స్థానంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ కు రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్థానంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య వస్తాడు. ఇక ఫినిషర్ గా 7వ స్థానంలో దినేష్ కార్తీక్ ఉంటాడు.
Advertisement
ఒకవేళ నన్ను ఈ మిడిల్ ఆర్డర్ ను ఎంపిక చేయాలనీ చెబితే ఇలాగె చేస్తాను అని అన్నాడు. అలాగే ఒకవేళ భారత జట్టుకు మరో బౌలింగ్ ఆప్షన్ అనేది కావాలి అంటే పంత్ ను జట్టు నుండి తీసేయాలి. ఆ స్థానంలో బౌలింగ్ చేసే సామర్ధ్యం ఉన్న దీపక్ హుడాను జట్టులోకి తీసుకోవాలి అని పుజారా క్లారిటీ ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి :