Home » రేవంత్ రెడ్డిని చూసి గర్వపడుతున్నా.. వర్మ ట్వీట్ వైరల్..!

రేవంత్ రెడ్డిని చూసి గర్వపడుతున్నా.. వర్మ ట్వీట్ వైరల్..!

by Anji
Ad

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పదేళ్లుగా బీఆర్ ఎస్ పాలన చూసిన తెలంగాణవాసులు ఈసారి మార్పు కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఉదయం నుంచి కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని సీఎం చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు రేవంత్ రెడ్డి పేరు ముందు సీఎం అని చేర్చి, సీఎం రేవంత్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలంగాణ ఎన్నికలపై సంచలన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ను అభినందిస్తూ.. రేవంత్ రెడ్డిని సీఎం అని సంబోధించి షాక్ ఇచ్చారు.

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చిన తరువాత కాంగ్రెస్ రూపు రేఖలన్ని ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పై నెగిటివిటి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో రోజులు మూడు, నాలుగు సభల్లో పాల్గొని అధికార పార్టీకి ధీటుగా కౌంటర్లు వేస్తూ.. ప్రజల మన్ననలు పొందారు. ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి మంచి జోష్ ని నింపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కలిగే లాభాలను ప్రజలకు సవివరంగా వివరించారు రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీలు అందరినీ ఆకట్టుకున్నాయి.

‘హాయ్.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. తొలిసారి.. చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీపై గౌరవం పెరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నాడు’ అని ఒక ట్వీట్ లో.. మరో ట్వీట్ లో..‘మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది.. తెలంగాణలో మాత్రమే గెలిచింది కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలిస్తే తప్ప కాంగ్రెస్ గెలుపు కాదు. బాహుబలి లాంటి రేవంత్ ఉన్నందుకు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు చెప్పాలి. చివరగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. వారియర్ కింగ్ రేవంత్ రెడ్డి. హే రేవంత్ రెడ్డి.. టేక్ ఎ బో” అన్నాడు. ఇప్పుడు ఈ ట్వీట్లు వైరల్‌గా మారాయి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading