అమ్మాయిలు అందం విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా గోళ్ళ విషయంలో కూడా. గోళ్లను పెంచడం, శుభ్రం చేసుకోవడం వాటికి నైల్ పాలిష్ తో మెరుగులు దిద్దుకోవడం.. ఇదంతా పెద్ద పనే. కానీ గోళ్ళని ఆరోగ్యంగా, అందంగా చూసుకోవడం కూడా ముఖ్యమైనదే. అయితే.. ఇంత జాగ్రత్తగా పెంచుకున్న గోళ్లు విరిగిపోతే ఆ బాధ చెప్పలేనిది. అయితే గోళ్లు ఎందుకు విరుగుతాయి? వాటిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Advertisement
నిజానికి గోళ్లు ఎందుకు విరుగుతాయో తెలిస్తే.. వాటిని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో తెలుస్తుంది. గోళ్లు విరిగిపోవడం అనేది పోషకాహార లోపానికి సంకేతం. శరీరంలో పోషకాహార లోపం ఉంటేనే గోళ్లు విరిగిపోతూ ఉంటాయి. మన శరీరంలోని ఆరోగ్య పరిస్థితిని మన గోళ్లు రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. గోళ్లు బలహీనంగా ఉండడం కూడా మన శరీరంలోని కొన్ని పోషకాలు లోపించడానికి సంకేతమే. మన శరీరంలో గోళ్లు ఆరోగ్యంగా, బలంగా పెరగాలంటే ప్రోటీన్ అవసరం ఎంతైనా ఉంది.
Advertisement
అయితే.. ప్రోటీన్ లోపిస్తేనే గోళ్లు బలహీనంగా మారతాయి. తగినంత ప్రోటీన్ తీసుకోకపోతే శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడి గోళ్లు పెళుసుగా మారతాయి. అందుకే విరిగిపోతూ ఉంటాయి. మీ గోళ్లు ఆరోగ్యంగా పెరగాలంటే మీరు తగినంత ప్రోటీన్ ఫుడ్ అంటే చికెన్, చేపలు, గుడ్లు, చిక్కుళ్లు, టోఫు లాంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
మరిన్ని ముఖ్య వార్తలు:
ఉపాసన డెలివరీ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా?
రామ్‌చరణ్ కూతురికి అంబానీ అత్యంత ఖరీదైన గిఫ్ట్!
ఒక్క యాడ్ కోసం.. రాజమౌళి ఎంత పారితోషకం తీసుకున్నారు అంటే..?