Home » ఒక్క యాడ్ కోసం.. రాజమౌళి ఎంత పారితోషకం తీసుకున్నారు అంటే..?

ఒక్క యాడ్ కోసం.. రాజమౌళి ఎంత పారితోషకం తీసుకున్నారు అంటే..?

by Sravya
Ad

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయి కి తీసుకు వెళ్లారు. బాహుబలి సినిమాతో ఒక రేంజ్ లో తెలుగు సినిమా స్థాయి ని బాలీవుడ్ కి తెలియజేశారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా అయితే ఇతను గ్లోబల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. ఇండియాకి ఆస్కార్ ని కూడా తీసుకువచ్చారు.. దర్శక ధీరుడు రాజమౌళి తో ఒక్క సినిమా చేసే ఛాన్స్ వచ్చినా చాలని చాలా మంది టాప్ హీరోలు అనుకుంటున్నారు.

rajamouli 1

Advertisement

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక చరిత్రని సృష్టించారు రాజమౌళి. రాజమౌళి సినిమాలతోనే బాగా బిజీగా ఉంటారు. ప్రతి సినిమాని కూడా ప్రాణం పెట్టి తీస్తారేమో అందుకే అపజయాలు రాజమౌళి కి లేవు. ఎప్పుడు సినిమాలతో బిజీగా వుండే రాజమౌళి ఈసారి మనకి ఓ యాడ్ లో కనపడ్డారు. ఇక రాజమౌళి నటించిన ఈ అడ్వర్టైజ్మెంట్ విషయానికి వస్తే..ప్రముఖ మొబైల్ కంపెనీ కోసం ఈ యాడ్ చేయడం జరిగింది. యాడ్ షూటింగ్ రాజస్థాన్లో జరిగింది.

Advertisement

మొదటి సారి యాడ్ కోసం రాజమౌళి ఎంత తీసుకున్నారు అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. రాజమౌళి ఈ యాడ్ కోసం మూడు కోట్ల రూపాయలను తీసుకున్నారట. ఇక సినిమాలకైతే రాజమౌళి 150 రూపాయల కోట్ల వరకు పారితోషకాన్ని తీసుకుంటారు. ఈ అడ్వర్టైజ్మెంట్ రీసెంట్ గా టెలికాస్ట్ అయ్యింది. అందులో చాలా స్టైలిష్ లుక్ లో కనపడ్డారు రాజమౌళి.

Also read:

BRO: బ్రో టీజర్ లో ఇంత మాటర్ ఉందా? ఈ విషయాలను నోటిస్ చేశారా?

సోంపు గింజలు తీసుకోవడం వలన ఎన్ని లాభాలో తెలిస్తే.. రోజూ తింటారు..!

ఇక కృష్ణ పని అయిపోయిందన్న టైంలో.. చిరు, నాగ్ లకి పెద్ద షాక్..!

Visitors Are Also Reading