టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరైనటువంటి వారిలో రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఒకరు. వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి 2012లో వివాహం చేసుకున్నారు. రామ్ చరణ్ హీరో కాగా, ఉపాసన అపోలో హాస్పిటల్ చైర్మన్. ఇక వీరు పెళ్లి అయిన 12 సంవత్సరాలకి తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. జూన్ 20, 01:49 నిమిషాలకు ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఉపాసన తన సొంత హాస్పిటల్ అయినటువంటి అపోలో హాస్పిటల్ లో తన బిడ్డకు జన్మనిచ్చింది. తన సొంత హాస్పిటల్ అయినప్పటికీ తన డెలివరీకీ అయిన ఖర్చును రామ్ చరణ్ కట్టాడట.
Advertisement
ఉపాసన డెలివరీ కోసం విదేశాలనుంచి స్పెషల్ డాక్టర్స్ ను హైదరాబాద్ కు తీసుకువచ్చారట. ఇక ఉపాసన డెలివరీ కోసం ఏకంగా కోటిన్నర రూపాయల ఖర్చు అయిందని సమాచారం. ఇక మెగా కుటుంబం లిటిల్ ప్రిన్సెస్ రాకతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ తన కూతురి నామకరణం 11వ రోజున చేస్తామని వెల్లడించారు. మెగా కుటుంబ సభ్యులు తన బిడ్డకు అంజలీదేవి అనే పేరు పెట్టాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక రామ్ చరణ్-ఉపాసన కూతురు బారసాల 11వ రోజున అంటే ఈరోజు జరగనుంది.
Advertisement
ఈ సందర్భంగా చెర్రీ కూతురు కోసం అపర కుబేరుడు బిలియనీర్ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అత్యంత ఖరీదైన బహుమతిని పంపినట్లు తెలుస్తోంది. రూ. 1.20 కోట్లతో సుమారు రెండు కేజీల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయించిన ఊయలను ఆయన గిఫ్ట్ గా పంపారని వార్తలు వస్తున్నాయి. మెగా ప్రిన్సెస్ కు ఆ ఊయలలోనే బారసాల చేస్తారని తెలుస్తోంది. ఇక ఉపాసన కూడా తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా “BTS అవర్ డార్లింగ్ డాటర్ నేమింగ్ సెర్మనీ” అనే క్యాప్షన్ ను జతచేశారు. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు.
ఇవి కూడా చదవండి
తెలుగు యాంకర్లను ట్రోల్ చేసిన టాలీవుడ్ కమెడియన్..TV9 దేవిని ఆడేసుకున్నాడుగా ?
Roja : రోజా కొడుకు ఫోటోలు వైరల్.. హీరోగా ఎంట్రీ ఇస్తారా?
సచిన్ను మోయడమా? ముసలోళ్లం.. మా వల్ల కాదన్నాం: వీరేంద్ర సెహ్వాగ్