సినిమా వాళ్లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రెటీలు రాజకీయాల్లో రానిస్తున్నారు. ఏపీ తెలంగాణలో పలువురు సినిమా తారలు పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేలు మంత్రులగా సైతం పనిచేస్తున్నారు. కాగా ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Advertisement
ALSO READ : ఈ వారం ఓటీటీలోకి వచ్చే బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే…
రీసెంట్ గా దిల్ రాజు బలగం సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. అంతే కాకుండా దిల్ రాజు పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ ఇండియాలోనే టాప్ ప్రొడ్యూసర్ ల లిస్ట్ లో ఉన్నాడు. కాగా ఇప్పుడు దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా దిల్ రాజు కాంగ్రెస్ లో చేరబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
అయితే ఈ వార్తలు రావడం వెనక బలమైన కారణం కూడా ఉంది. తాజాగా కాంగ్రెస్ నేత రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోడో యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. కాగా ఈ యాత్రలో భాగంగానే రేవంత్ రెడ్డి నిజామాబాద్ లోని నార్సింగిపల్లిలో పాదయాత్రకు వెళ్లి అక్కడ శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకున్నాడు.
అయితే అక్కడ దిల్ రాజు రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడం హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు సొంత ఊరు నిజామాబాద్ కాగా ప్రస్తుతం హైదరాబాద్ లోనే సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటున్నాడు. అలాంటిది నిజామాబాద్ వెళ్లి రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు పొలికల్ ఎంట్రీ వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
ALSO READ : రాజమౌళి తన సినిమాల్లో ప్రకాశ్ రాజ్ ని తీసుకోకపోవడానికి కారణం అదేనా ?