Home » ఈ వారం ఓటీటీలోకి వచ్చే బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే…

ఈ వారం ఓటీటీలోకి వచ్చే బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే…

by Bunty
Ad

కరోనా విజృంభించిన అనంతరం చాలా సినిమాలు ఓటీటీ లోనే రిలీజ్ అవుతున్నాయి. పెద్ద స్టార్ హీరోలా సినిమాలు కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ వారం ఓటీటీలోకి వచ్చే బ్లాక్ బస్టర్ మూవీస్ ఎంటో తెలుసుకుందాం.

Advertisement

 

రైటర్ పద్మభూషణ్ :

 

సుహాస్ ప్రధాన పాత్రలో షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన చిత్రం రైటర్ పద్మభూషణ్. ఆశిష్ విద్యార్థి, రోహిణి, టీనా శిల్ప రాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం, చిన్న సినిమాగా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన తొలి రోజు నుంచే అద్భుతమైన టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ గా నిలిచింది. సుహాస్ నటనకు మరోసారి విమర్శకుల ప్రశంసలు అందాయి. ఇక ఇప్పటివరకు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ లో ఈ నెల 17వ తేదీ నుంచి రైటర్ పద్మభూషణ్ స్ట్రీమింగ్ అవుతుంది.

Advertisement

సార్:

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలి స్ట్రైట్ తెలుగు మూవీ సార్. వెంకీ అట్లూరి దర్శకుడు. హైపర్ ఆది, తనికెళ్ల భరణి, అక్కినేని సుమంత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వరద పారించింది. రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఓటిటిని ఏలేందుకు వచ్చేస్తోంది. ఈ నెల 17వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

 

Read Also: Dasara : “దసరా” ట్రైలర్ విడుదల.. గత్తర్ లేపిన నాని

Visitors Are Also Reading