Telugu News » Blog » ర‌జినీ జైల‌ర్ మూవీ నుంచి త‌ప్పుకున్న ప్రియాంక మోహ‌న్ ఎందుకో తెలుసా..?

ర‌జినీ జైల‌ర్ మూవీ నుంచి త‌ప్పుకున్న ప్రియాంక మోహ‌న్ ఎందుకో తెలుసా..?

by Anji
Ads

స్టార్‌ హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న న‌టి ప్రియాంక మోహ‌న్‌. తెలుగు, మ‌ళ‌యాలం చిత్రాల్లో న‌టింటించింది. ఇక ఆ త‌రువాత ఈమె కోలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్‌లో ఈమె న‌టించిన తొలి చిత్రం డాక్ట‌ర్‌. ఈ సినిమా ఆమెకు స‌క్సెస్‌తో స్వాగ‌తం ప‌లికింది. ఆ త‌రువాత అదే హీరోతో రొమాన్స్ చేసిన డాన్ చిత్రం కూడా మంచి స‌క్సెస్‌ను అందించింది. దీంతో కోలీవుడ్‌లో స‌క్సెస్ పుల్ హీరోయిన్ అనే ముద్ర వేసుకుంది.

Ads

Priyanka Mohan
త‌మిళ స్టార్ హీరో సూర్య‌తో క‌లిసి న‌టించిన‌ ఎదుర్కుమ్ తుణింద‌వ‌మ్ చిత్రం ఈమెకు నిరాశ‌ప‌రిచింద‌నే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ ఆమెకు వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌స్తూనే ఉన్నాయి. అందులో సూప‌ర్ స్టార్ రజినీకాంత్ జైలర్‌ చిత్రం కూడా ఒక‌టి. కొల‌మావు కోకిల‌. డాక్ట‌ర్‌, బీస్ట్ చిత్రాల ద‌ర్శ‌కుడు నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. రజినీకాంత్ ద్విపాత్రాభిన‌యం చేస్తుండ‌డం విశేషం. ఈ సినిమా నుంచి న‌టి ప్రియాంక మోహ‌న్ వైదొలిగిన‌ట్టు తెలుస్తోంది.

Ads

Also Read :  ఐఎండీబీ రేటింగ్ ప్రకారం వ‌ర‌స్ట్ సినిమాలు ఇవే..? అన్నింటికంటే వ‌రస్ట్ సినిమా ఏదంటే..?

ప్ర‌ధానంగా డాక్ట‌ర్ చిత్రంలో న‌టిస్తున్న స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు నెల్స‌న్‌తో మ‌న‌స్పార్థాలే ఆమె ఈ చిత్రాన్ని వ‌దులుకోవ‌డానికి కార‌ణం అని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న అధికారికంగా రాలేదు. ప్రియాంక మోహ‌న్ వ‌దులుకున్న పాత్ర‌లో త‌మ‌న్నా న‌టించేందుకు ఒప్పుకున్న‌ట్టు స‌మాచారం. ప్రియాంక మోహ‌న్ కూడా ఈ విష‌యంపై స్పందిచ‌లేదు. ప్ర‌స్తుతం రాజేశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఓ సినిమాలో జయం ర‌వి సరసన ఈమె నటిస్తోంది.

Ad

Also Read :  ఆ యంగ్ హీరోకు జోడిగా రోజా కూతురు…?