Home » ఆ యంగ్ హీరోకు జోడిగా రోజా కూతురు…?

ఆ యంగ్ హీరోకు జోడిగా రోజా కూతురు…?

by AJAY
Published: Last Updated on

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా రాణించిన హీరోయిన్ లలో రోజా కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి రోజా అభిమానులను సంపాదించుకున్నారు. అంతే కాకుండా దాదాపు అందరూ స్టార్ట్స్ పక్కన జోడిగా నటించిన అభిమానులను మెప్పించారు. ఇక రోజా సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణిస్తున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం రోజా ఏపీలో మంత్రి పదవిలో ఉన్నారు.

ఇదిలా ఉంటే హీరోల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం కామన్ అయిపోయింది. కాగా ఇప్పుడు హీరోయిన్ ల కూతుళ్ళు గా సినిమాల్లోకి వస్తున్నారు. కాగా గత కొద్ది రోజులుగా రోజా కుమార్తె అన్షు మాలిక కూడా ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అన్షుమాలిక రీసెంట్ గా 19 ఏళ్లలో అడుగుపెట్టింది. కాగా ఇప్పుడు తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొడుకు ద్రువ్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అవ్వబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ధృవ్ విక్రమ్ ఇప్పటికే తెలుగు లో సూపర్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ తో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా అనుకున్న మెరవిజయం సాధించలేకపోయింది.

Visitors Are Also Reading