Home » ఆ క్రికెటర్ తో ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ హీరోయిన్..!

ఆ క్రికెటర్ తో ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ హీరోయిన్..!

by Azhar
Ad

ప్రస్తుతం మన ఇండియాలో తెలుగు సినిమా ఇండీస్ట్రీకి పెద్ద పేరు వచ్చింది. అందుకు కారణం మన సినిమాలు సూపర్ హిట్స్ కొట్టడమే. అయిన కూడా మన తెలుగు సినిమాల్లో చూస్తే తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ. అందుకు కారణం ఏంటి అనేది చెప్పడం కష్టం. అయితే ఇక్కడ టాలీవుడ్ లో ఉన్న తెలుగు హీరోయిన్స్ లలో ప్రియాంక జవాల్కర్ ఒక్కరు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు ప్రేమలో ఉంది. అది కూడా ఓ క్రికెటర్ తో.

Advertisement

అయితే మాములుగా క్రికెటర్స్ తో ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ ప్రేమాయణం నడుపుతారు. కానీ ఇప్పుడు ఇందులో కూడా మన తెలుగు ఇండస్ట్రీను ముందుకు తెలుస్తుంది ప్రియాంక. అయితే ఈ మధ్యే ప్రియాంక తన సోషల్ మీడియాలో వ్యక్తి ఫెస్ కనిపించకుండా ఫోటో పోస్ట్ చేసి.. ఇతనే అంటూ లవ్ సింబల్ ను యాడ్ చేసింది. దాంతో ప్రియాంక ఆ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు అందరికి అర్ధం అయ్యింది. ఇక ఆ వ్యక్తి కూడా ఎవరు మనకు తెలుసు అంటూ పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అతను ఎవరో కాదు.. టీం ఇండియా ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ఇలా చేయడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే.. గతంలో ఓసారి ప్రియాంక పెట్టిన ఫోటోకు క్యూట్ అంటూ కామెంట్ పెట్టాడు వెంకటేష్ అయ్యర్. దానికి ప్రియాంక స్పందిస్తూ.. ఎవరు.. నువ్వా అంటూ రిప్లయ్ ఇచ్చింది. దాంతో అప్పుడే ఫిక్స్ అయిపోయారు మన సోషల్ మీడియా జనాలు.. వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని. ఇక ఇప్పుడు ప్రియాంక పోస్ట్ చేసిన ఫోటోలో కూడా ఆ వ్యక్తి కొంచెం వెంకటేష్ అయ్యర్ లాగే కనిపిస్తుండటంతో ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఐపీఎల్ లో కీలకథ నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించే వెంకటేష్ అయ్యర్ ప్రస్తుతం రెండు టీ20 ల సిరీస్ కోసం ఐర్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

ఒక్కపుడు ఐసీసీ అంపైర్.. కానీ ఇప్పుడు చెప్పులు అమ్ముకుంటున్నాడు.. ఎందుకు..?

మళ్ళీ కెప్టెన్సీ చేయనున విరాట్ కోహ్లీ.. ఎందుకో తెలుసా..? 

Visitors Are Also Reading