Home » నా సమయం వస్తే చూపిస్త అంటున్న ప్రియాంక…!

నా సమయం వస్తే చూపిస్త అంటున్న ప్రియాంక…!

by Azhar
Published: Last Updated on
Ad

మన తెలుగులో హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. అందులో ఏ అబద్ధం లేదు. కానీ అందులో మన తెలుగు వారు ఎందరు అంటే మాత్రం ఎవరు చెప్పలేరు. ఎందుకంటే తెలుగు సినిమాల్లో ఎక్కువగా బయట నుండి వచ్చిన హీరోయిన్స్ కే అవకాశాలు అనేవి వస్తుంటాయి. ఈ విషయంలో చర్చ అనేది ఎప్పటి నుండో జరుగుతుంది. అయితే ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్న అతి తక్కువ తెలుగు హీరోయిన్స్ లలో ప్రియాంక జవాల్కర్ కూడా ఉంటుంది. 2017 లోనే టాలీవుడ్ లోకి వచ్చిన ప్రియాంక… విజయ్ దేవరకొండ తో నటించిన టాక్సీవాలా అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఏ ఈసినిమా హిట్ అయిన ప్రియాంకకు ఎక్కువ అవక్షను రాలేదు.

Advertisement

ఇక గత ఏడాది వచ్చిన తిమ్మరుసులో ఛాన్స్ కొట్టేసిన ప్రియాంక… మరో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత వెంటనే ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. కానీ ఇప్పుడు ఈ అమ్మడుకు అవకాశాలు రావడం లేదు. అందుకే సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ అనేది పెంచుతూ వస్తుంది. మామూలుగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియాంక జవాల్కర్.. ఎప్పుడు ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. అప్పుడప్పుడు వారితో మాట్లాడుతూ.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇస్తుంది.

Advertisement

 

 

 

అయితే ఇప్పుడు మరోసారి అదే పాణి చేసిన ప్రియాంక జవాల్కర్ ను ఓ అభిమాని.. మీరు తమిళంలో ఎప్పుడు సినిమా చేస్తారు అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా నేను కోలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న. నాకు అవకాశాలు వస్తే తప్పకుండ చేసి చూపిస్త అని పేర్కొంది. ఇక కోలీవుడ్ లో ఏ హీరో అంటే ఇష్టం అని ప్రశ్నించగా.. నాకు ధనుష్, శింబు అంటే చాలా ఇష్టం అని పేర్కొంది. అయితే ఈ మధ్యే ఈ అమ్మడి టీం ఇండియా ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ తో ప్రేమలో ఉంది అని పెద్ద చర్చే వచ్చింది. కానీ ఈ చాట్ లో ఆ విషయం పై ప్రియాంక జవాల్కర్ ఏ కామెంట్ చేయలేదు.

ఇవి కూడా చదవండి :

ప్రయివేట్ ఐపీఎల్ నే నడిపిస్తున్న గుజరాత్ మేధావులు… లక్షల్లో..?

మళ్ళీ రెస్ట్ కోరుతున్న కోహ్లీ.. బీసీసీఐ ఏం చేయనుంది..?

Visitors Are Also Reading