Home » మళ్ళీ రెస్ట్ కోరుతున్న కోహ్లీ.. బీసీసీఐ ఏం చేయనుంది..?

మళ్ళీ రెస్ట్ కోరుతున్న కోహ్లీ.. బీసీసీఐ ఏం చేయనుంది..?

by Azhar
Ad

ప్రస్తుతం భారత జట్టులో జరుగుతున్న పరిణామాల పట్ల క్రికెట్ ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. సీనియర్ ఆటగాళ్లను ప్రతి సిరీస్ తప్పించి సిరీస్ కు రెస్ట్ అనే పేరుతో కూర్చోబెట్టడం ఏ మాత్రం అభిమానులకు నచ్చడం లేదు. అందులోనూ ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ శర్మలను పక్కన బెట్టడం పెద్ద చర్చగా మారుతుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత ఈ ఇద్దరికి విశ్రాంతి ఇచ్చింది బీసీసీఐ. గత కొంతకాలంగా పరుగులు చేయలేకపోవుతున్న వీరికి.. కొంత బ్రేక్ కావాలనే ఉద్దేశ్యంతో సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కు ఎంపిక చేయలేదు.’

Advertisement

ఈ విరామం తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలోను ప్రస్తుతం వీరు పరుగులు చేయక.. విఫలమవుతున్నారు. దాంతో ఇంగ్లాండ్ తర్వాత వెస్టిండీస్ వెళ్లే వన్డే జట్టులో కూడా వీరికి చోటు అనేది కల్పించలేదు బీసీసీఐ. కాకపోతే వన్డే తర్వాత జరగబోయే టీ20 సిరీస్ కు వీరితో పాటు మిగిలిన అందరూ ఆటగాళ్లు వస్తారు అని తెలుస్తుంది. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ విండీస్ టూర్ నుండి తనకు మొత్తం రెస్ట్ ఇవ్వాలని విరాట్ కోహ్లీ బీసీసీఐని అడిగాడట. దాంతో ఇప్పుడు ఏం చేయాలని అనే ఆలోచనలో బీసీసీఐ పడినట్లు ఓ అధికారి తెలిపారు.

Advertisement

తాజాగా బీసీసీఐకి సంబంధించిన ఓ అధికారి మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ విండీస్ తో జరిగే టీ20 సిరీస్ నుండి కూడా విశ్రాంతి కోరాడు. అయితే మాములుగా ఏ ఆటగాడు రెస్ట్ కావాలని అడిగిన బీసీసీఐ అంగీకిరిస్తుంది. ఇక ఫామ్ లో లేని ఆటగాడు అడిగితే మాత్రం తప్పకుండ ఇస్తుంది. ఎందుకంటే రెస్ట్ కావాలనే వారిని బలవంతంగా ఆడించలేము కదా..! కానీ ఇప్పుడు కోహ్లీ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రావిడ్ తో మాట్లాడి విరాట్ విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది అని ఆ సదరు అధికారి పేర్కొన్నాడు. అయితే ఈ ఆదివారం లోపు విండీస్ పర్యటనకు వెళ్లే టీ20 జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి మద్దతుగా… కపిల్ కు పంచ్ ఇచ్చిన రోహిత్..!

ప్రయివేట్ ఐపీఎల్ నే నడిపిస్తున్న గుజరాత్ మేధావులు… లక్షల్లో..?

Visitors Are Also Reading