ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయనాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు కురిపించుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పీఎం ఒకే పార్టీ నుండి ఉన్నా రాష్ట్రంలో అభివృద్ది మాత్రం కనిపించడం లేదని అన్నారు. ఉత్తరప్రదేశ్ ను మూడు దశాబ్దాల పాటూ పాలించిన ఎస్పీ,బీఎస్పీ మరియు బీజేపీ పార్టీలు అభివృద్దిని మర్చిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రేసేతర రాజకీయ పార్టీలు కులం మతం పేరుతో రాజకీయాలు చేయడం వల్లనే ఉత్తర ప్రదేశ్ అభివృద్ది చెందలేదని చెప్పారు.
Advertisement
Advertisement
రాష్ట్రంలోని మూడు పార్టీలు కూడా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికార దక్కించుకోవాలని చూస్తున్నాయని అన్నారు. బీజేపీ నేతలు ఉత్తరప్రదేశ్ కు వచ్చి పాకిస్థాన్…మతాల గురించి మాట్లాడుతారు కానీ అభివృద్ధి గురించి మాట్లాడలేదని అన్నారు. మీ పిల్లలకు సరైన ఉద్యోగాలు విద్య అందకపోయినా ప్రజలు భావోద్వేగాలకు లోనై ఓట్లు వేస్తున్నారని వ్యాఖ్యానించారు.