Home » అరుంధతి సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ?

అరుంధతి సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ?

by Bunty
Ad

అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు నటనకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. తన అందం, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ భామ. దాదాపు అగ్ర హీరోలు అందరి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

Advertisement

ఇక అనుష్క తన కెరీర్లో నటించినటువంటి అన్ని సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సినిమా అరుంధతి. ఈ సినిమాలో అనుష్క నటనకుగాను ఎంతోమంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో అనుష్క నటన అద్భుతంగా ఉంది. అలాగే ఈ సినిమాలో విలన్ పాత్రలో సోనుసూద్ అందరినీ భయపెట్టి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా మొదటగా అనుష్కను కాకుండా మరో హీరోయిన్ అనుకున్నారట కోడి రామకృష్ణ. ఆ హీరోయిన్ మరెవరో కాదు హీరోయిన్ ప్రేమ. మొదటగా ఈ సినిమాలో హీరోయిన్గా ప్రేమను సంప్రదించారట డైరెక్టర్ కోడి రామకృష్ణ. దేవి సినిమా సమయంలో ప్రేమకు తెలుగులో మాట్లాడడం నేర్పించారట కోడి రామకృష్ణ.

Advertisement

ఇక ప్రేమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…అరుంధతి సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదటగా నన్ను సంప్రదించారు. కానీ అప్పటికే నేను కన్నడ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా ఆఫర్ ను వదులుకున్నాను. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే ఈ సినిమా ఆఫర్ ను వదులుకున్నాను. కానీ స్టోరీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాను వదులుకున్నందుకు నేను ఇప్పటికీ బాధపడుతుంటానని ప్రేమ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Visitors Are Also Reading