Home » Prashanthi Harathi: పెళ్లాం ఊరెళితే సినిమాలో సునీల్ భార్య గుర్తుందా..? మళ్ళీ 20 ఏళ్ళకి..!

Prashanthi Harathi: పెళ్లాం ఊరెళితే సినిమాలో సునీల్ భార్య గుర్తుందా..? మళ్ళీ 20 ఏళ్ళకి..!

by Sravya
Ad

Prashanthi Harathi: సినీ ఇండస్ట్రీలో ఏ చిన్న పాత్ర చేసిన కూడా అందరికీ గుర్తుండి పోతారు. సినీ హీరో హీరోయిన్లు వంటి మెయిన్ రోల్స్ మాత్రమే కాదు సహాయ పాత్రలు చేసినా కూడా అందరికీ గుర్తుండిపోతుంటారు. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు కూడా మనకి గుర్తుండి ఉంటారు. అలాంటి వాళ్ళలో ప్రశాంతి హారతి కూడా ఒకరు ఈమె పేరు చెప్తే ఎవరికీ గుర్తు ఉండదు కానీ పెళ్ళాం ఊరెళితే మూవీలో సునీల్ పాత్రకి భార్యగా నటించిన ఆమె అంటే కచ్చితంగా గుర్తుంటుంది. భార్యని గుడ్డిగా నమ్మే అమాయకపు భార్య పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది.

Advertisement

ఈ సినిమా కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఇంద్ర సినిమాలో ముస్లిం అమ్మాయిగా నటించి అందరినీ ఆకట్టుకుంది ఇవే కాకుండా పలు సినిమాల్లో కూడా ఈమె నటించింది. పెళ్ళాం ఊరెళితే సినిమాలో మాత్రం ఈమె గుర్తుండి పోయే పాత్ర చేసి అందర్నీ ఆకట్టుకుంది. శ్రీకాంత్ సంగీత వేణు సునీల్ తదితరులు ఈ సినిమాలో నటించారు. 2003లో వచ్చిన ఈ సినిమాకి రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ మూవీ దాదాపు 100 రోజులకి పైగా ఆడింది.

Also read:

Advertisement

ఈ మూవీలో అద్భుతంగా నటించినందుకు చిరంజీవి చేతుల మీదుగా ఈమె షీల్డ్ కూడా తీసుకున్నారు. పెళ్లి తర్వాత ఈమె ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఇంట్లో వాళ్ళు ఈమెకి పెళ్లి చేసేయడంతో భర్తతో పాటు అమెరికాలో సెటిల్ అయిపోయింది. నటి మాత్రమే కాదు కూచిపూడి డాన్సర్ కూడా. క్లాసికల్ డాన్స్ ఫోటో షూట్ లు ఇస్తున్న టైంలోనే ఆమెకి మూవీస్ లో అవకాశం వచ్చింది. అమెరికాలో ఈమె డాన్స్ అకాడమీ స్టార్ట్ చేసి చిన్నపిల్లలకి ఇండియన్ కల్చర్ కూచిపూడి డాన్స్ నేర్పిస్తున్నారు. తొలిసారి ఈమె 20 ఏళ్ల తర్వాత మీడియం ముందుకి వచ్చారు ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు తనకి మళ్లీ సినిమాల్లోకి రావాలని ఉందని సినిమాలు సీరియల్స్ ఇలా ఏ ఆఫర్ వచ్చినా కూడా నటించడానికి రెడీగా ఉన్నానని చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading