Home » నాతో క‌లిసి న‌టించ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు..ప్ర‌కాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్..!

నాతో క‌లిసి న‌టించ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు..ప్ర‌కాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్..!

by AJAY
Published: Last Updated on
Ad

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రకాష్ రాజ్. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రకాష్ రాజ్ అభిమానులను సంపాదించుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో హీరోలను ఢీకొట్టే పాత్రలలో నటించి మెప్పించారు. కేవలం పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా నెగటివ్ రోల్స్ లోను ప్రకాష్ రాజ్ తనదైన స్టైల్ తో మెప్పించారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషలలో సినిమాలు చేస్తున్నారు.

Advertisement

భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ అత్యధిక రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చురుకుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 2019 సంవత్సరంలో బెంగళూరు లోక్ సభ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఇక సోషల్ మీడియా ద్వారా బిజెపి ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్స్ చేస్తుంటారు. అయితే తాజాగా ఇంటర్వ్యూలో ప్రకాష్ మాట్లాడుతూ… తనతో సినిమాలో నటించేందుకు తోటి నటీనటులు భయపడుతున్నారని అన్నారు. తన సినిమా కెరియర్ పై రాజకీయ ప్రభావం పడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పారు.

Advertisement

కొందరు తనతో నటించడానికి భయపడుతున్నారని తనతో నటిస్తే అంగీకరిస్తారో లేదో అని నటించడం లేదని చెప్పారు. అలాంటి వారిని కోల్పోవడానికి తను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన భయం మరొకరికి అలుసుగా మారకూడదని అందుకే ఎలాంటి పరిణామాలు ఎదురైనా ధైర్యంగా ముందుకెళతానని వెల్లడించారు. వాటిని స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. తాను ఇప్పుడు మరింత స్వేచ్ఛగా జీవిస్తున్నానని స్వరాన్ని వినిపించకపోతే కేవలం నటుడుగానే చనిపోతానని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.

Visitors Are Also Reading