Home » ఉపాసన బిడ్డ కోసం ఊయల సిద్దం.. ఎవరు తయారు చేశారో తెలుసా ?

ఉపాసన బిడ్డ కోసం ఊయల సిద్దం.. ఎవరు తయారు చేశారో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్  ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ మీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా చిరుత సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.  ఇక ఆ తరువాత రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేశాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ‘RRR’ మూవీతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. రామ్ చరణ్ తన స్నేహితురాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ తరుణంలో శ్రేయాభిలాషులు ఉపాసనకు బహుమతులు పంపిస్తూ.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Advertisement

తాజాగా ఉపాసనకు ఓ అపురూపమైన కానుక వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అపోలో ఆసుప్రతి అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రామ్ చరణ్. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. జూన్ 14న 11వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. మెగా వారసత్వం ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసినప్పటి నుంచి మెగా ఫ్యామిలీ.. అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. సెలబ్రెటీలు, సన్నిహితులు ఉపాసనకు బహుమతులు పంపిస్తూ.. శుభాకాంక్షలు తెలియజేశారు. 

Advertisement

తాజాగా ఉపాసనకు ఓ అపురూపమైన కానుక వచ్చింది. ప్రజ్వల ఫౌండేషన్  వారు ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం ఓ ఊయలని తయారు చేసి పంపించారు. ఇక ఈ విషయం గురించి తెలియజేస్తూ.. స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఉపాసన. “నాకు అస్సలు నమ్మశక్యంగా లేదు.. ఈ ఊయల.. ప్రజ్వల ఫౌండేషన్ లోని కొంతమంది అమ్మాయిలు స్వయంగా తయారు చేశారు. వారంతా హ్యుమన్ ట్రాఫికింగ్ నుంచి బయటపడిన యువతులు వీరి నుంచి ఇంత అపురూపమైన కానుక అందుకున్నందుకు చాలా గర్వగా ఫీల్ అవుతున్నాను. ఊయల చేతిలో తయారు చేసింది. ఊయల చాలా బలంగా బాగుంది అని పోస్ట్ చేసింది ఉపాసన. ప్రస్తుతం ఉపాసన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

టాలీవుడ్ లో బట్టతల ఉన్న హీరోలు వీళ్లేనా?

 సమంతతో ఉన్న రిలేషన్ పై ప్రీతమ్ జుకాల్కర్ ఆసక్తికర కామెంట్స్..!

కమెడీయన్ సుధాకర్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading