Home » ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ప్రభాస్, మారుతీ ప్రాజెక్ట్ పై అప్డేట్ అవుట్…!

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ప్రభాస్, మారుతీ ప్రాజెక్ట్ పై అప్డేట్ అవుట్…!

by Sravya
Ad

ప్రభాస్ సలార్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా అనుకున్న దానికంటే బాగా పెద్ద హిట్ అయింది. భారీగా కలెక్షన్లను కూడా రాబడుతోంది. దాదాపు నాలుగు ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోలేదు ప్రభాస్. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూసిన అభిమానులు సలార్ సినిమాతో హ్యాపీ అయిపోయారు. చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ కుష్ అయ్యారు. వెండితెరపై మరోసారి ప్రభాస్ మాస్ నట విశ్వరూపాన్ని చూపించారు ప్రశాంత్ నీల్ అద్భుతంగా సినిమా కి దర్శకత్వం వహించారు డిసెంబర్ 22న సినిమా బాక్సాఫీస్ షేక్ చేసేసింది. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 500 కోట్ల క్లబ్లో చేరి బాక్స్ ఆఫీస్ రికార్డుని బద్దలు కొట్టేసింది.

Advertisement

ఇప్పుడు డార్లింగ్ తదుపరి సినిమాలపై అదే స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ రాలేదు. సైలెంట్ గా మూవీ షూటింగ్ జరిగిపోతోంది ఇందులో మాళవిక మోహన్, నిది అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి ఆరా తీస్తున్నారు కానీ ఎటువంటి ప్రకటన అయితే రాలేదు.

Advertisement

తాజాగా ఒక ప్రకటనని విడుదల చేశారు ఈ ఏడాది ముగింపులోనే ప్రభాస్ అభిమానులు శుభవార్త వింటారని మూవీ మేకర్స్ చెప్పారు. ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ని సంక్రాంతి కానుకగా రివీల్ చేస్తున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పోస్ట్ చేసింది మళ్లీ వింటేజ్ ప్రభాస్ ని అభిమానులు ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ కి మారుతి దర్శకత్వంలో కూడా హిట్ వస్తుందని అభిమానులు అనుకుంటున్నారు. మరి ప్రభాస్ కి ఆ సినిమా తో కూడా హిట్ వస్తుందో లేదో చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading