రెబల్ స్టార్ ప్రభాస్ 2007 సమ్మర్ కానుకగా మున్నా సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో ఇలియానా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, రాహుల్‌దేవ్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి హరీస్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా వరుస హిట్‌లతో దూసుకుపోతున్న నిర్మాత దిల్‌రాజ్ బ్యానర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మున్నా తెరకెక్కింది. వంశీ పైడిపల్లి ఈ చిత్రంతో తెలుగు తెరకు దర్శకునిగా పరిచయమయ్యారు.
Also Read : SRIREDDY : స్టార్ డాటర్స్ విషయంలో శ్రీరెడ్డి చెప్పిందే జరుగుతుందా….?
Advertisement
Advertisement
ఈ సినిమా ఎగ్జిక్యూషన్ బాగున్నా.. అంచనాలు అందుకోలేకపోయింది. ఆ కథను సెలెక్ట్ చేసినప్పుడే దిల్‌రాజు రిజెక్ట్ చేశారట. అయితే కొరటాల శివ అప్పుడు రచయితగా ఉన్నారు. ఆయన కూడా కథ బాగుందని చెప్పడం.. దర్శకుడు వంశీ దిల్‌రాజుకు బంధువు కావడం.. సినిమాను హిట్ చేస్తానని చెప్పడంతో ఇష్టంలేకుండానే దిల్‌రాజు ఓకే చేశారట. సినిమా రిలీజ్ రోజు ఉదయం 3 గంటలకు ప్రీమియర్ షో చూసిన వెంటనే సినిమా తేడా కొట్టిందని దిల్‌రాజుకు అర్థం అయిపోయిందట. సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్లు చేసి సినిమా అనుకున్న దానితో పోల్చితే కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. నా జడ్జ్‌మెంట్ దాటేసి ప్రేక్షకులకు ఎక్కడో నచ్చేస్తే మన లక్.. మీకు నేనున్నా అని భరోసా ఇచ్చారట.
చివరకు మున్నా సినిమా మార్నింగ్ షోకే ప్లాప్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్లాప్ అయ్యాక దర్శకుడు వంశీ కాస్త డిజాప్పాయింట్‌లోకి వెళ్లిపోయారట. ఒకనొక దశలో సినిమాలు వదిలేసి వెనక్కు వెళ్లిపోదామా..? అని కూడా అనుకున్నారట. మున్నా ప్లాప్ అయిందని తెలిసిన తరువాత కూడా ఎన్టీఆర్ వంశీకి ఫోన్ చేసి కథ పరంగా ఎక్కడో తేడా కొట్టిందే తప్ప దర్శకునిగా నువ్వు ఫెయిల్ కాలేదని.. నీ టేకింగ్ కొత్తగా ఉందని మెచ్చుకున్నారట. మంచి కథ ఉంటే రెడీ చేయ్ నేను నీకు ఛాన్స్ ఇస్తానని చెప్పారట. ఆ తరువాత బృందావనం కథతో ఎన్టీఆర్‌ను కలవడం.. ఐదు నిమిషాలకే ఎన్టీఆర్ ఓకే చెప్పడం అలా క్షణాల్లో జరిగిపోయాయట. నిర్మాత దిల్‌రాజుతో పాటు ఎన్టీఆర్ ఆయనకు భరోసా ఇచ్చారని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు వంశీ పైడిపల్లి. బృందావనం సినిమాతో తాను హిట్ కొట్టానని వంశీ నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ తనకు చేసిన సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని వంశీ చెప్పుకొచ్చారు.
Also Read : RRR : ఆ చిన్నారి పాడిన పాటకు కీరవాణి ఫిదా..!